
మిల్లు యజమానిపై కేసు నమోదు
మదనాపురం: మండల కేంద్రంలోని లక్ష్మీ వేంకటేశ్వర రైస్‌మిల్లు యజమాని మంజులపై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు పౌరసరఫరాలశాఖ డీటీ ఆసిఫ్ తెలిపారు. శనివారం డీఎస్‌ఓ కాశీవిశ్వనాథ్, అధికారుల బృందం రైస్‌మిల్లులో తనిఖీలు నిర్వహించగా 2022–2023, 2023–24 వానాకాలం, యాస ంగి సీజన్‌లో ప్రభుత్వం కేటాయించిన వరి ధాన్యంలో 80 వేల బస్తాలు తక్కువగా ఉన్నాయని.. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని, విచారణ చేసి చర్యలు తీసుకుంటామని చెప్పారు. అధికారుల వెంట ఆర్‌ఐ రాజేశ్వరి ఉన్నారు.
విద్యార్థుల సామర్థ్యాలు పెంచేలా బోధన
పాన్‌గల్: విద్యార్థుల సామర్థ్యాలు పెంచేలా బోధన సాగించాలని జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి (ఏఎంఓ) మహానంది సూచించారు. శనివారం మండలంలోని దావాజిపల్లి ప్రాథమికోన్నత పాఠశాలను ఆయన సందర్శించి తెలుగు, ఆంగ్లం, గణితంలో విద్యార్థుల సామర్థ్యాలు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించి బోధనపై పలు సూచనలు చేశారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం కురుమూర్తినాయక్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.
వేంకటేశ్వరస్వామి ఆలయ హుండీ లెక్కింపు
వనపర్తిటౌన్: జిల్లాకేంద్రంలోని వేంకటేశ్వరస్వామి ఆలయ హుండీ లెక్కింపు ప్రక్రియ శనివారం దేవాదాయశాఖ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వరమ్మ, ఆలయ ధర్మకర్త అయ్యలూరి రఘునాథాచార్యుల పర్యవేక్షణలో చేపట్టారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు 30 మంది భక్తులు నాలుగు హుండీలను లెక్కించారు. గతేడాది డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు రూ.4,24,340 ఆదాయం సమకూరిందని అధికారులు ధ్రువీకరించడంతో పాటు బ్యాంకు ఖాతాలో జమచేశారు. కార్యక్రమంలో ఈఓ ఆంజనేయులు పాల్గొన్నారు.

మిల్లు యజమానిపై కేసు నమోదు

మిల్లు యజమానిపై కేసు నమోదు