
బండ్ నిర్మాణానికి సహకరించాలి
గోపాల్‌పేట: మండలంలోని బుద్దారం పెద్దచెరువును రిజర్వాయర్‌గా మార్చే పనుల్లో భాగంగా త్వరలోనే బండ్ నిర్మాణం చేపడతామని.. రైతులు సహకరించాలని ఇరిగేషన్ డీఈ గఫార్ కోరారు. గురువారం గ్రామంలోని రైతువేదికలో బండ్ నిర్మాణంలో ముంపునకు గురవుతున్న పొలాల రైతులతో సమావేశమయ్యారు. బండ్ నిర్మాణానికి 11 ఎకరాల భూమి అవసరమని.. ఇందుకోసం సర్వే కూడా పూర్తయిందని చెప్పారు. ప్రభుత్వం నష్ట పరిహారంగా ఎకరాకు రూ.9 లక్షల నుంచి రూ.11 లక్షల వరకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. సమావేశంలో రిజర్వాయర్ ఇన్‌చార్జ్ తహసీల్దార్‌సుభాష్‌నాయుడు, డిప్యూటీ తహసీల్దార్ శివలింగం, ఆర్‌ఐ యాదయ్య, సర్వేయర్ మైనుద్దీన్, సీనియర్ అసిస్టెంట్ సురేష్, రైతులు తదితరులు పాల్గొన్నారు.