కర్షకుల కథ.. కన్నీటి వ్యథ | - | Sakshi
Sakshi News home page

కర్షకుల కథ.. కన్నీటి వ్యథ

Apr 4 2025 12:23 AM | Updated on Apr 4 2025 12:23 AM

కర్షక

కర్షకుల కథ.. కన్నీటి వ్యథ

చేదురుబావితండాలో ఇద్దరు యువరైతులు

పొట్టకూటి కోసం వెళ్లి ఏడుగురి మృత్యువాత

పంటలకు నీరు పారించేందుకు వెళ్లిన ముగ్గురు రైతులను బలి తీసుకున్న కరెంటు

ఇద్దరు కూలీలను కాటేసిన పిడుగు

గేదెలు మేపేందుకు వెళ్లి మరో ఇద్దరు..

ఉమ్మడి జిల్లాలో విషాదం నింపిన వేర్వేరు ఘటనలు

వారంతా కర్షకులు.. పొద్దున్నే లేచి వ్యవసాయ పనులకు వెళ్లి పొట్ట నింపుకోవడం వారి దినచర్య. గురువారం సైతం యథావిధిగా వారివారి పనులకు వెళ్లిపోయారు. అయితే వీరిని విధి

చిన్నచూపు చూసింది.. కరెంట్‌ రూపంలో ముగ్గురు రైతులు.. పిడుగు రూపంలో మరో ఇద్దరు కూలీలతోపాటు..గేదెలు మేపేందుకు వెళ్లిన మరో ఇద్దరిని బలి తీసుకుంది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో విషాదం నింపిన ఆయా ఘటనలకు సంబంధించి వివరాలిలా..

సూరాపూర్‌లో మరో రైతు..

లింగాల: నాగర్‌కర్నూల్‌ జిల్లా లింగాల మండలంలోని సూరాపూర్‌కు చెందిన రైతు దేశ పర్వతాలు(40) విద్యుదాఘాతంతో మృతిచెందిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. తన సొంత వ్యవసాయ పొలంలో సాగు చేసిన మొక్కజొన్న పంటకు నీరు పెట్టడానికి గురువారం తెల్లవారుజామున పొలం దగ్గరకు వెళ్లాడు. అయితే బోరు మోటార్‌ ఆన్‌ చేసే సమయంలో స్టార్టర్‌ దగ్గర తేలి ఉన్న వైరు తగిలి షాక్‌తో అక్కడికక్కడే మృతిచెందినట్లు తెలిపారు. పర్వతాలుకు భార్య చిట్టెమ్మ, కుమారుడు, కూతురు ఉన్నారు. ఈ ఘటనపై భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు.

అచ్చంపేట రూరల్‌: వ్యవసాయ పొలంలోని పాంపాండ్‌లో ఉన్న బోరు మోటారును సరిచేసే క్రమంలో విద్యుదాఘాతానికి గురై ఇద్దరు యువరైతులు మృతి చెందారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట మండలంలోని చేదురుబావితండాకు చెందిన కాట్రావత్‌ లోక అలియాస్‌ లోకేష్‌(30) తన వ్యవసాయ పొలంలో (పాంపాండ్‌) బోరు మోటారు రెండు రోజుల నుంచి పనిచేయడం లేదు. దీంతో సమీప పొలంలోని ముడావత్‌ కుమార్‌(28) విషయం చెప్పి బుధవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో సాయంగా తీసుకెళ్లాడు. బోరు మోటారు సరి చేస్తుండగా.. ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందారు. ఇద్దరు యువ రైతులు పొలం వద్ద మృతి చెందిన సంఘటన ఎవరికీ తెలియలేదు. బుధవారం సాయంత్రం అయినా ఇళ్లకు తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబీకులు.. అర్ధరాత్రి వరకు ఇద్దరికి ఫోన్‌ చేయగా రింగ్‌ అయినప్పటికీ ఎత్తలేదు. దీంతో కుటుంబసభ్యులు, తండావాసులు తండా, చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు. గురువారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో లోకేష్‌ పొలం వద్ద ఓ చెట్టు కింద బైక్‌ను గమనించారు. అక్కడికి వెళ్లిన కొందరు ఫోన్‌ చేయగా పాంపాండ్‌ వద్ద సెల్‌ఫోన్‌ రింగ్‌ కాగా అక్కడికి వెళ్లి చూడగా ఇద్దరూ శవమై కనిపించారు. దీంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. పాంపాండ్‌ నుంచి ఇద్దరి మృతదేహాలను తండాకు తరలించారు. ఈ ఘటనపై లోక తండ్రి హన్యా ఫిర్యాదు మేరకు సిద్దాపూర్‌ ఎస్‌ఐ పవన్‌కుమార్‌ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలకు అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. లోకకు భార్య సరితతోపాటు కుమారుడు, కుమార్తె ఉన్నా రు. అలాగే కుమార్‌కు భార్య వినోజితో పాటు కు మార్తె, కుమారుడు ఉన్నారు. బాధిత కుటుం సభ్యులను పలువురు నాయకులు పరామర్శించారు.

కర్షకుల కథ.. కన్నీటి వ్యథ 1
1/3

కర్షకుల కథ.. కన్నీటి వ్యథ

కర్షకుల కథ.. కన్నీటి వ్యథ 2
2/3

కర్షకుల కథ.. కన్నీటి వ్యథ

కర్షకుల కథ.. కన్నీటి వ్యథ 3
3/3

కర్షకుల కథ.. కన్నీటి వ్యథ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement