ఆయిల్‌పాం ఫ్యాక్టరీ పనులు అడ్డుకున్న గ్రామస్తులు
కొత్తకోట రూరల్: మండలంలోని సంకిరెడ్డిపల్లి శివారులో ఆయిల్‌పాం ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఇటీవల మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వ హయాంలోనూ మాజీ మంత్రి కేటీఆర్ సైతం మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. కాగా.. ఆదివారం ఉగాది రోజన ఫ్యాక్టరీ నిర్మాణ పనులు ప్రారంభించేందుకు యాజమాన్యం యంత్రాలతో రాగా, గ్రామస్తులు ఒక్కసారిగా అక్కడకు చేరుకొని ఫ్యాక్టరీ మాకొద్దు.. పనులు ప్రారంభించొద్దని అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ ఆనంద్ సిబ్బందితో అక్కడకు చేరుకొని గ్రామస్తులకు నచ్చజెప్పడంతో వెనుదిరిగారు. అనంతరం ఫ్యాక్టరీ వారు పనులు ప్రారంభించి వెళ్లిపోయారు.


