విద్యకు అధిక ప్రాధాన్యమిస్తున్న ప్రభుత్వం.. | - | Sakshi
Sakshi News home page

విద్యకు అధిక ప్రాధాన్యమిస్తున్న ప్రభుత్వం..

Mar 28 2025 12:52 AM | Updated on Mar 28 2025 12:52 AM

విద్యకు అధిక ప్రాధాన్యమిస్తున్న ప్రభుత్వం..

విద్యకు అధిక ప్రాధాన్యమిస్తున్న ప్రభుత్వం..

కాంగ్రెస్‌ ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తుందని.. తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పించాలని జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్‌ గోవర్ధన్‌సాగర్‌ కోరారు. బడిపిల్లల సంబరాల కార్యక్రమం ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులకు బహుమతులు అందజేసి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి తమవంతు సహకారం ఉంటుందన్నారు. కార్యక్రమ నిర్వహణకు ఆర్థిక తోడ్పాటునందించిన దాత తిరుపతయ్యసాగర్‌ను విద్యాశాఖ తరఫున సన్మానించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. జిల్లా విద్యా శాఖ అధికారులు గణేష్‌కుమార్‌, చంద్రశేఖర్‌, ఎంఈఓలు శ్రీనివాసులు, నర్సింహ, మద్దిలేటి, శ్రీనివాస్‌గౌడ్‌, కాంగ్రెస్‌పార్టీ నాయకులు రవికుమార్‌, రాముయాదవ్‌, మధుసూదన్‌రెడ్డి, బ్రహ్మయ్య, జయరాములుసాగర్‌, వివిధ పాఠశాలల జీహెచ్‌ఎంలు, హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement