
ప్రత్యేక కార్యాచరణతో..
పురపాలికలో ఆస్తి, కొళాయి పన్ను వసూళ్లకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నాం. రూ.2.37 కోట్లు లక్ష్యం కాగా.. ఇప్పటి వరకు రూ.1.20 లక్షలు వసూలు చేశాం. మిగిలిన మొత్తాన్ని పది రోజుల్లో పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించాం. ఇంటి పన్నుతో పాటు కొళాయి పన్ను సైతం వసూలు చేస్తున్నాం.
– చికెన్ శశిధర్, పుర కమిషనర్, ఆత్మకూర్
వార్డుల వారీగా వసూలు..
పురపాలికలో రూ.55 లక్షల ఇంటి పన్ను వ సూలు చేయాల్సి ఉంది. ఇచ్చిన లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు వార్డు అధికారులతో కలిసి ఇల్లిల్లూ తిరిగి వసూలు చేస్తున్నాం. ఇప్పటి వరకు రూ.31.51 లక్షలు వసూలయ్యాయి. పురపాలికకు ప్రధాన ఆదాయ వనరు అయిన ఇంటి పన్ను వసూలుపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం.
– రవిబాబు, పుర కమిషనర్, అమరచింత
●

ప్రత్యేక కార్యాచరణతో..