వాహనాలు అక్రమంగా రోడ్లపై తిప్పితే చర్యలు
ఖిల్లాఘనపురం: ఆర్సీ, పర్మిట్, ఇన్స్యూరెన్స్, ట్యాక్స్, డ్రైవింగ్ లైసెన్స్ తదితర పత్రాలు లేకుండా వాహనాలను రోడ్లపై తిప్పితే చర్యలు తప్పవని డీటీఓ మానస హెచ్చరించారు. గురువారం మండలానికి వచ్చిన ఆమె ఖిల్లాఘనపురం –మహబూబ్‌నగర్ ప్రధాన రహదారిపై వాహన తనిఖీలు చేపట్టారు. పత్రాలు సక్రమంగా లేని ఏడు వాహనాలు సీజ్ చేసి కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. సీజ్ చేసిన వాహనాలను పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వాహనాలకు సంబంధించిన పత్రాలు కలిగి ఉండాలని వివరించారు.


