
నడిచి వెళ్లాల్సిందే..
గ్రామ రహదారి అధ్వానంగా ఉందని ఆటోలు సైతం రావడం లేదు. ఆర్టీసీ బస్ కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే వస్తుంది. గ్రామానికి బస్ సౌకర్యం కల్పించాలని అధికారులకు విన్నవిస్తే రోడ్డు బాగోలేదంటున్నారు. ఎక్కడికై నా వెళ్లాలంటే స్టేజీ వరకు నడిచి వెళ్లాల్సిందే. 65 ఏళ్ల వయస్సులో మోకాళ్ల నొప్పులతో నడిచి వెళ్లడం ఇబ్బందిగా ఉంది. – లక్ష్మమ్మ, ధర్మాపురం
అంబులెన్స్ కూడా రాదు..
అత్యవసర సమయాల్లో అంబులెన్స్ కోసం ఫోన్‌చేసే రోడ్డు బాగోలేదని.. రామంటూ సిబ్బంది సమాధానమిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా ఇదే పరిస్థితి. తప్పని పరిస్థితుల్లో ఆటోలు, ట్రాక్టర్లలో అమరచింత, ఆత్మకూర్‌కు తీసుకెళ్లాల్సి వస్తోంది. అధికారులు, ఎమ్మెల్యే సమస్యను పరిష్కరించాలి.
– ద్యావర్ల చెన్నప్ప, ధర్మాపురం

నడిచి వెళ్లాల్సిందే..