వనపర్తి: ఉగాది జిల్లా ప్రజల జీవితాల్లో మంచి మార్పు తీసుకురావాలని.. అందరికి శుభం కలగాలని ఎస్పీ రావుల గిరిధర్ ఆకాంక్షించారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో విశ్వ బ్రాహ్మణ వేదపండితులు రూపొందించిన పంచాంగాన్ని ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. సమాజ శ్రేయస్సు, ప్రజలను చైతన్యపర్చే ప్రబోదాలు అర్చకుల నుంచి రావాలని కోరారు. అర్చకుల మంత్రాల విశిష్టత, అర్థం తెలియజేసి ప్రజలను సన్మార్గం వైపు మళ్లించాలన్నారు. అనంతరం వేదపండితులు ఎస్పీని శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో విశ్వ బ్రాహ్మణ అర్చక పురోహిత సంఘం జిల్లా అధ్యక్షుడు నారాయణదాసు గోవర్ధనాచారి, గౌరవ అధ్యక్షుడు లవకుమారాచారి, హిమవంతాచారి, నర్సింహాచారి, బ్రహ్మచారి, బైరోజు చంద్రశేఖర్, విరాట్ ఆచారి, శ్రీహరి ఆచారి, విక్రమ్ ఆచారి తదితరులు పాల్గొన్నారు.