
రెవెన్యూ వ్యవస్థ బలోపేతానికే జీపీఓలు
వనపర్తి: గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకే ప్రభుత్వం జీపీఓల నియామకం చేపడుతోందని రెవెన్యూ అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జీపీవోల నియామకం అంశంపై పూర్వ వీఆర్వోలు, వీఆర్‌ఏలకు ఆప్షన్ల ఎంపికపై అవగాహన కార్యక్రమం నిర్వహించగా ఆయన హాజరై మాట్లాడారు. ఆప్షన్ల ఎంపికకు పూర్వ వీఆర్వోలు, వీఆర్‌ఏలకు ఈ నెల 16వ వరకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని తెలిపారు. పోస్టులకు సంబంధించి బాధ్యతలు తదితర అంశాలను వారికి వివరించారు. సమావేశంలో కలెక్టరేట్ ఏఓ భానుప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.