వనపర్తిటౌన్: ఆర్టీసీ అభివృద్ధికి దశాబ్దాల పాటు పనిచేసి రిటైర్డ్ అయిన ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని టీజీఎస్‌ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు జేవీ స్వామి, గౌరవ అధ్యక్షుడు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి పుట్టా ఆంజనేయులు డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని ఆర్టీసీ డిపో ఎదుట టీజీఎస్‌ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (సీఐటీయూ ఏఐఆర్‌టీడౠ్ల్యఎఫ్ అనుబంధం) ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో వారు పాల్గొని మాట్లాడారు. విశ్రాంత కార్మికులకు రావాల్సిన టెర్మినల్ లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, గ్రాట్యుటీతో సహా అన్ని ప్రయోజనాలు నెలలోపే చెల్లించాలన్నారు. 2017 పేస్కేల్‌ను అమలు చేసి ఏరియర్స్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మెడికల్ ఫెసిలిటీ స్కీం (ఆర్‌ఐఎంఎస్)ను రూ.20 లక్షలు పెంచాలని.. కనీస పింఛన్ రూ.9 వేలు, ఈపీఎఫ్‌కు కరువు భత్యం, వేతన ఒప్పందాలను లింక్ చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పింఛన్, తెల్ల రేషన్ కార్డులు జారీ చేయాలని పేర్కొన్నారు. అనంతరం డిమాండ్ల వినతిపత్రాన్ని డీఎం వేణుగోపాల్‌కు అందజేశారు. కార్యదర్శి కృష్ణయ్య, రిటైర్డ్ ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు.