జిల్లాకేంద్రంలో పదోతరగతి
పరీక్ష కేంద్రాన్ని పరిశీలిస్తున్న
అధికారులు
ఆత్మకూర్: జిల్లాలో శుక్రవారం నుంచి పదోతరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మొత్తం 179 ఉన్నత పాఠశాలలు ఉండగా.. 6,853 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇందులో బాలురు 3,419 మంది, బాలికలు 3,434 మంది ఉన్నారు. జిల్లావ్యాప్తంగా 36 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. కేంద్రాల్లో విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా తాగునీరు, ఫర్నీచర్, ఫ్యాన్లు, ఇతర సౌకర్యాలు సమకూర్చారు. ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాలను బిగించారు. 36 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 36 మంది డిపార్ట్‌మెంటల్ అధికారులు, 400 మంది ఇన్విజిలేటర్లు, రెండు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, నాలుగు రూట్ ఆఫీసర్ల బృందాలు ఏర్పాటు చేశారు. వనపర్తి, ఆత్మకూర్, పెబ్బేరు, కొత్తకోట, వీపనగండ్ల, పెద్దమందడి, పాన్‌గల్, ఖిల్లాఘనపురం, గోపాల్‌పేట, రేవల్లి పోలీస్‌స్టేషన్లలో ప్రశ్నపత్రాలు భద్రపర్చనున్నారు.
జిల్లాలో 179 ఉన్నత పాఠశాలలు.. 6,853 మంది విద్యార్థులు
36 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు