
మిల్లర్లు ధాన్యాన్ని వెంటనే దించుకోవాలి
ఖిల్లాఘనపురం: రైస్‌మిల్లర్లు కేంద్రాల నుంచి వచ్చిన వరి ధాన్యాన్ని వెంటనే లారీల నుంచి దించుకొని ట్రక్‌షీట్లపై సంతకం చేసి తిప్పి పంపాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం మండలంలోని సోళీపురం గ్రామంలో ఉన్న సింధు ట్రేడర్స్ రైస్‌మిల్లును ఆయన ఆకస్మికంగా తనిఖీచేసి ధాన్యం బస్తాలతో ఉన్న వాహనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రస్తుతం జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో పెద్దఎత్తున ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయని.. కేంద్రాల నుంచి ధాన్యం తరలిస్తున్నామని, మిల్లర్లు వెంటనే దించుకొని పంపాలన్నారు. ఎక్కడైనా ఆలస్యమవుతుందని ఫిర్యాదులు వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అదేవిధంగా మిల్లులో ధాన్యాన్ని మర ఆడించి సకాలంలో ఎఫ్‌సీఐకి బియ్యం అప్పగించాలని సూచించారు. ఎక్కడ ఎలాంటి పొరపాట్లు జరగకుండా మండలస్థాయిలో అధికారులు పర్యవేక్షణ చేయాలని కోరారు.