
వేసవి కాలం.. చల్లని నేస్తం
ఉక్కపోత నుంచి ఉపశమనానికి ప్రజల పరుగులు
స్టేషన్ మహబూబ్‌నగర్: రోజురోజుకూ ఎండలు ముదురుతున్నాయి. దీంతో భరించలేని ఉక్కపోతతో ఇళ్లలో ఉండలేని పరిస్థితి. ఫ్యాన్లు ఉన్నోళ్లు కూలర్లు, కూలర్లు వాడుతున్న వారు ఏసీలు కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇంకా వేసవి సీజన్ ప్రారంభం కావడంతో వ్యాపారులు కొత్త మోడళ్లను అందుబాటులోకి తీసుకురాగా కొనుగోలుదారులతో దుకాణాలు కిక్కిరిశాయి. ఇవే కాకుండా పళ్ల రసాలు, జ్యూస్‌లు, ఐస్‌క్రీమ్ పార్లర్లు సైతం కిటకిటలాడుతున్నాయి.
● ఏసీలు, ఫ్రిజ్‌ల
కొనుగోళ్లతో షాపుల్లో రద్దీ
● పండ్ల జ్యూస్‌లు, లస్సీ, ఐస్‌క్రీమ్‌లకు భలే గిరాకీ
● ఉమ్మడి జిల్లావ్యాప్తంగా
రూ.కోట్లలో సీజనల్ వ్యాపారం

వేసవి కాలం.. చల్లని నేస్తం