
లారీలు రావడం లేదు
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి 10 రోజులు దాటుతుంది. లారీలు కొరత ఉందని వడ్లు కాంటా చేయట్లేదు. దీంతో రోజుల తరబడి ధాన్యంతో పాటు కొనుగోలు కేంద్రాల్లో మేము ఉండాల్సి వస్తోంది. దీనికి తోడు ఈదురు గాలులు, అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోతుంది.
– పెంటయ్య, చిన్నమందడి
ఈదురు గాలులతో
ఆందోళన
అకాల వర్షాలు, ఈదురు గాలులతో తేమ శాతం వచ్చిన వడ్లు కూడా తడిసిపోవడంతో తిరిగి ఎండబెట్టాల్సి వస్తోంది. దీంతో కూలీల ఖర్చు పెరుగుతుంది. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు స్పందించి వడ్లు కాంటా త్వరగా చేపట్టాలి.
– రాంరెడ్డి, పాంరెడ్డిపల్లి కార్పొరేషన్
త్వరలోనే సమస్య
పరిష్కారం..
జిల్లావ్యాప్తంగా శుక్రవారం వరకు సుమారు నాలుగు వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కేంద్రాల్లో తూకం చేసి తరలింపునకు సిద్ధంగా ఉంది. లారీలు, హమాలీల కొరత కారణంగా తరలింపునకు బ్రేక్ పడింది. వెల్టూరు గోదాములో ధాన్యం నిల్వ చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తరలింపును రెండ్రోజుల్లో పూర్తి చేస్తాం. ట్యాబ్ ఎంట్రీల విషయంపై దృష్టి సారిస్తాం. కొన్న ధాన్యాన్ని ఎప్పటికప్పుడు ట్యాబ్ ఎంట్రీ చేయించి ట్రక్‌షీట్ తయారు చేసేలా చర్యలు తీసుకుంటాం.
– జగన్మోహన్, డీఎం,
జిల్లా పౌరసరఫరాలశాఖ
●