వనపర్తిటౌన్: నిరుద్యోగ దివ్యాంగ యువతకు హైదరాబాద్‌లోని సమర్థనం దివ్యాంగుల సంస్థ ఆధ్వర్యంలో ఐటీఈఎస్ (కంప్యూటర్, బీపీఓ,సాఫ్ట్ స్కిల్స్) కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ రాష్ట్ర కో–ఆర్డినేటర్ నల్లపు శ్రవణ్‌కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 18 నుంచి 35 ఏళ్లలోపు వయస్సు ఉండి 10వ తరగతి ఉత్తీర్ణులైన వారు అర్హులని పేర్కొన్నారు. శిక్షణ కాలంలో ఉచిత భోజనం, వసతి, స్టడీ మెటీరియల్స్ అందిస్తామని.. ఆసక్తి గల యువత 10వ తరగతి మెమో, ఆధార్‌కార్డు, సదరం సర్టిఫికేట్, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో హైదరాబాద్‌లోని ట్రస్ట్‌లో ఈ నెల 15వ తేదీలోగా సంప్రదించాలన్నారు. మరిన్ని వివరాలకు సెల్‌నంబర్లు 63648 67804, 63648 63218 సంప్రదించాలని సూచించారు.
వైద్యసిబ్బందికి శిక్షణ
వనపర్తి విద్యావిభాగం: ప్రత్యేక ఇమ్యునైజేషన్ కార్యక్రమం సందర్భంగా బుధవారం జిల్లాకేంద్రంలో వైద్యసిబ్బంది, డాటా ఎంట్రీ ఆపరేటర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డీఎంహెచ్‌ఓ డా. శ్రీనివాసులు, డీఐఓ డా. పరిమళ హాజరై మాట్లాడారు. మొదటి విడత ఏప్రిల్ 21 నుంచి 28 వరకు, రెండో విడత మే 21 నుంచి 28 వరకు, మూడో విడత జూన్ 23 నుంచి 30 వరకు టీకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించాలని చెప్పారు. వ్యాక్సిన్ వేసుకోని చిన్నారులు, గర్భిణుల ఇళ్లను సందర్శించి వివరాలు సేకరించడంతో పాటు టీకాల పంపిణీకి కార్యాచరణ రూపొందించాలని సూచించారు.
ఘనంగా టీపీఆర్టీయూ ఆవిర్భావ వేడుకలు
వనపర్తి విద్యావిభాగం: టీపీఆర్టీయూ ఆవిర్భావ వేడుకలను బుధవారం జిల్లాకేంద్రంలో ఘనంగా నిర్వహించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు తలకంటి మహిపాల్‌రెడ్డి జెండా ఆవిష్కరించి మాట్లాడారు. తెలంగాణ మలిదశ ఉద్యమ సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ఉపాధ్యాయ సంఘాల రాష్ట్ర నాయకత్వం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు తెలుపకుంటే చీలిక తెచ్చి 2011, ఏప్రిల్ 9న పీఆర్టీయూ–తెలంగాణ అనే సంఘం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి నాయకత్వంలో విద్యావ్యవస్థ పటిష్టత, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి సంఘం ఎంతో కృషి చేస్తోందన్నారు. ప్రభుత్వ విద్యావ్యవస్థను బలోపేతం చేయడానికి నిబద్ధతతో పని చేస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో సంఘం నాయకులు రాయినిపల్లి శ్రీనివాసులు, పల్లా శ్రీనివాసులు, గోపాల్‌రెడ్డి, శేఖర్‌రెడ్డి, నాగరాజు, రాజశేఖర్, శ్రీనివాసులు, పరందాములు, కిరణ్, విష్ణువర్ధన్‌రెడ్డి, రాములు, సురేందర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, లోకారెడ్డి, బాలస్వామి, ఆంజనేయులు, రత్నకుమార్, వెంకటస్వామి, సంతోష్, అమిన్‌రెడ్డి, స్వామి తదితరులు పాల్గొన్నారు.
బీజేపీతోనే నిరుద్యోగ యువతకు భవిష్యత్
వనపర్తిటౌన్: రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తేనే నిరుద్యోగ యువతకు భవిష్యత్ ఉంటుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు డి.నారాయణ అన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలోని 11, 14, 15, 17, 32 వివేకానంద చౌరస్తాలో వేర్వేరుగా పార్టీ జెండాలను ఎగురవేసి మాట్లాడారు. గ్రామపంచాయతీ, పుర ఎన్నికల్లో యువత చురుగ్గా పాల్గొనాలని, యువత రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆసక్తి చూపాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు సబిరెడ్డి వెంకట్‌రెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్ లోక్‌నాథ్‌రెడ్డి, రాష్ట్ర మహిళామోర్చా జాయింట్ ట్రెజరర్ నారాయణదాసు జ్యోతి రమణ, జిల్లా ఉపాధ్యక్షుడు సీతారాములు, పట్టణ అధ్యక్షుడు రాజశేఖర్, పట్టణ ప్రధాన కార్యదర్శి నవీన్, కార్యవర్గసభ్యుడు వెంకటేష్, నాయకులు ఖాజా, శంకర్‌నాయక్, భాస్కర్, ప్రతాప్, శివగౌడ్, లింగేశ్వర్, రామకృష్ణ, రాజు, మండ్ల వెంకటేశ్, రాములు, శ్రీనివాసులు, శ్రీను, రవి, చిరంజీవి, రఘు, గోవిందు, సుదర్శన్, వసంత్‌రెడ్డి, అరవింద్, చాణక్య, వంశీ తదితరులు పాల్గొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
దరఖాస్తుల ఆహ్వానం