
ప్రభుత్వం తరఫున ముస్లింలకు ఇఫ్తార్
వనపర్తి: పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇఫ్తార్ విందు ఇవ్వనున్నట్లు రెవెన్యూ అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లు తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఇఫ్తార్ విందు నిర్వహణపై సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముస్లింలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇఫ్తార్ విందు ఇచ్చేందుకు మతపెద్దల ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో తీర్మానించామని, తేదీని త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. సమావేశంలో ఆర్డీఓ సుబ్రమణ్యం, జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి అఫ్జలుద్దీన్, తహసీల్దార్ రమేశ్‌రెడ్డి, ముస్లిం మతపెద్దలు పాల్గొన్నారు.
వైద్య కళాశాల ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్‌గా డా. డి.కిరణ్మయి
వనపర్తి: జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాల ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్‌గా డా. డి.కిరణ్మయి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టరేట్‌కు చేరుకొని కలెక్టర్ ఆదర్శ్ సురభిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. డా. కిరణ్మయి జిల్లాకేంద్రంలోని ఎంసీహెచ్‌లో మూడేళ్లుగా గైనకాలజీ నిపుణురాలిగా విధులు నిర్వర్తిస్తున్నారు.
రైస్‌మిల్లు
తనిఖీ చేసిన డీఎస్‌ఓ
కొత్తకోట రూరల్: మండలంలోని మిరాసిపల్లి సమీపంలో ఉన్న ఓ రైస్ మిల్లులో ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని అధికారులు ఇదివరకు సీజ్ చేశారు. ఆ ధాన్యాన్ని రాత్రికి రాత్రి తరలిస్తున్నారన్న ప్రాథమిక సమాచారంతో డీఎస్‌ఓ కాశీవిశ్వనాథ్ బుధవారం మిల్లుకు చేరుకొని పరిశీలించారు. లారీలో ఉన్న వరి ధాన్యం ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా నుంచి మిల్లు యజమాని కొనుగోలు చేసి తీసుకొచ్చినట్లు పత్రాలు చూపించారని డీఎస్‌ఓ వివరించారు. సీజ్ చేసిన ధాన్యం భద్రంగానే ఉన్నట్లు అధికారులు తెలిపారు.
వేరుశనగ
క్వింటా రూ.7,050
జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం వేరుశనగకు క్వింటాల్ గరిష్టంగా రూ.7,050, కనిష్టంగా రూ.4,001 ధరలు లభించాయి. అదేవిధంగా కందులు గరిష్టంగా రూ.6,649, కనిష్టంగా రూ.6,111, మొక్కజొన్న గరిష్టంగా రూ.2,329, కనిష్టంగా రూ.2,137, ఆముదాలు, జొన్నలు గరిష్టంగా రూ.4,379, కనిష్టంగా రూ.3,977 ధరలు లభించాయి. దేవరకద్ర మార్కెట్ యార్డులో కందుల ధర క్వింటాల్‌కు గరిష్టంగా రూ.6,019గా ఒకే ధర పలికింది.
నల్లకుసుమలు రూ.4,109..
నారాయణపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం నల్లకుసుమలు క్వింటాల్‌కు గరిష్టం, కనిష్టంగా రూ.4,109 ధర పలికాయి. అలాగే, పెసర గరిష్టం, కనిష్టంగా రూ.7,475, వేరుశనగ గరిష్టం రూ.5,449, కనిష్టం రూ.5,020, జొన్నలు గరిష్టం రూ.4,735, కనిష్టం రూ.2,812, అలసందలు గరిష్టం రూ.7,176, కనిష్టం రూ.5,109, ఎర్ర కందులు గరిష్టం రూ.7,311, కనిష్టం రూ.6,069, తెల్ల కందులు గరిష్టం రూ.7,305, కనిష్టం రూ.6 వేలు పలికాయి.

ప్రభుత్వం తరఫున ముస్లింలకు ఇఫ్తార్