
రేషన్.. పరేషాన్
చౌకధర దుకాణాలకు చేరిన సన్నబియ్యం
●
50 కిలోల సంచులనే
అందిస్తాం..
రేషన్ దుకాణాలకు చేరిన సన్న బియ్యం సంచుల్లో 50 కిలోలకుగాను 47 కిలోల బియ్యం ఉన్నాయనే సమాచారంతో జిల్లాలోని గోదాంలను పరిశీలించాం. రేషన్ దుకాణాలకు స్టాక్ పాయింట్ నుంచి ఎన్ని క్వింటాళ్ల బియ్యం అందించాలో అక్కడే తూకం చేసి లారీల్లో తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
– జగన్మోహన్, డీఎం, పౌరసరఫరాలశాఖ
అమరచింత: ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ లబ్ధిదారులకు ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా జిల్లాలోని రేషన్ దుకాణాలకు ఇటీవల లారీల్లో బియ్యం తరలించారు. అమరచింతలోని రేషన్ దుకాణాలకు వచ్చిన సంచుల్లో బియ్యం తక్కువగా కనిపించడంతో డీలర్లు వాటిని తూకం వేసి చూడగా ఒక్కో సంచిలో కేవలం 45 నుంచి 47 కిలోలు మాత్రమే ఉండటంతో ఆందోళనకు గురయ్యారు. లబ్ధిదారులందరూ సన్నబియ్యం తీసుకెళ్తారని.. సంచుల్లో బియ్యం తక్కువగా ఉంటే ఎలా భర్తీ చేస్తామని ప్రశ్నిస్తున్నారు. ఏదో ఒక లారీ లోడ్‌లో ఇలా జరిగిందంటే పొరపాటేనని.. పట్టణంలోని దుకాణాలన్నింటికి వచ్చిన సంచుల్లో ఇవే తేడాలున్నాయని వాపోతున్నారు.
గోదాంల పరిశీలన..
రేషన్ దుకాణాలకు సన్నబియ్యం సరఫరా జరుగుతున్న వేళ 50 కిలోల సంచిలో 47 కిలోల బియ్యం ఉన్నాయనే సమాచారంతో జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారులు ఆయా గోదాంలను ఇటీవల పరిశీలించారు. సంచులు పాతబడటం, లారీల్లోకి తరలించే క్రమంలో రంధ్రాలు పడి తూకంలో తేడాలు వచ్చాయని అధికారులు భావిస్తున్నారు. ఏదేమైనా 50 కిలోల బియ్యం సంచిలో 47 కిలోల బియ్యం రావడంపై పూర్తిస్థాయిలో విచారణ చేపడతామని.. డీలర్లు నష్టపోకుండా చర్యలు తీసుకుంటామంటున్నామని అధికారులు వివరించారు.
సంచిలో 50 కిలోలకు బదులుగా సుమారు 47 కిలోలే..
ఆందోళనలో డీలర్లు
జిల్లాలో ఇదీ పరిస్థితి..
జిల్లాలో 255 గ్రామాలు.. 325 రేషన్ దుకాణాలున్నాయి. మొత్తం 1,63,138 తెల్లరేషన్ కార్డులుండగా.. 5,23,972 మందికి ప్రతి నెలా ఉచిత బియ్యం పొందుతున్నారు. ప్రతి నెల 43,461 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం సివిల్ సప్లై స్టాక్ పాయింట్ నుంచి దుకాణాలకు చేరుతున్నాయి.

రేషన్.. పరేషాన్

రేషన్.. పరేషాన్