
ఆయకట్టు రైతులను ఆదుకోవాలి
మదనాపురం: కురుమూర్తి ఎత్తపోతల పథకం ఆయకట్టులో రైతులు సాగు చేసిన యాసంగి పంటలు ఎండిపోకుండా నీటిని అందించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జబ్బార్ కోరారు. మంగళవారం మండలంలోని రామన్‌పాడు జలాశయంలో నీటి నిల్వలు, పంటలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. జలాశయంలో రోజురోజుకు నీటిమట్టం తగ్గుతుందని, పంటలు ఎండిపోయే పరిస్థితులు ఉన్నాయన్నారు. రాష్ట ప్రభుత్వం కర్ణాటక అధికారులతో మాట్లాడి జూరాల ప్రాజెక్ట్‌కు నీటిని విడుదల చేయించాలన్నారు. కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి వెంకట్రాములు, నాయకులు వెంకటేష్, చెన్నయ్య, కొత్తపల్లి గ్రామ రైతులు పాల్గొన్నారు.