ఆత్మకూర్: రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలన్నింటిని వెంటనే నెరవేర్చాలని, సమస్యలన్నింటిని పరిష్కరించాలని తెలంగాణ రైతుసంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకటయ్య డిమాండ్ చేశారు. ఆదివారం మండల కేంద్రంలోని వర్తక సంఘం భవనంలో సీపీఐ జిల్లా కార్యదర్శి విజయరాములు ఆధ్వర్యంలో జరిగిన జిల్లా మూడో మహాసభలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అనంతరం జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా మాసన్న, ఉపాధ్యక్షులుగా భీమన్న, ప్రదీప్, కార్యదర్శిగా రాబర్ట్, సహాయ కార్యదర్శులుగా ఆర్‌ఎన్ కుమార్, మశప్పతో పాటు 15 మంది సభ్యులను ఎన్నికయ్యారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు శ్రీహరి, నాయకులు సీఎన్ శెట్టి, మోషా, భరత్, బాలరాజు, లింగన్న, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
పొట్టి శ్రీరాములుకు
ఘన నివాళి
కొత్తకోట రూరల్: పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలను ఆదివారం కొత్తకోటలో ఘనంగా నిర్వహించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ పి.ప్రశాంత్ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. పొట్టి శ్రీరాములు జీవితం అందరికీ ఆదర్శమని, ఆయన కృషితోనే తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని కొనియాడారు. మహాత్ముడు బోధించిన సత్యం, అహింస, హరిజనోద్ధరణకు జీవితాంతం కృషి చేశారని, అమరజీవి పొట్టి శ్రీరాములు ఆశయ సాధనకు అందరం పునరంకితం అవుదామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బీచుపల్లి, ఏజే బోయేజ్, మేసీ్త్ర శ్రీనివాసులు, ఎల్లంపల్లి నరేందర్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, లక్ష్మయ్య, ఎజాజ్‌అలీ, తయ్యబ్, రఫీఖాన్, సంద వెంకటేశ్, వైశ్యసంఘం నాయకులు బాదం వెంకటేష్, రమేష్, ఆర్.వెంకటేష్, బాలరాజు యాదవ్, పసుపుల రమేష్, క్రాంతికుమార్, అంజి సాగర్ తదితరులు పాల్గొన్నారు.
క్రీడలకు ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
గోపాల్‌పేట: రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యత ఇస్తోందని.. జిల్లాను క్రీడల హబ్‌గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రం నుంచి ఏదుట్ల వెళ్లే దారిలో హనీ క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉమ్మడి జిల్లా క్రికెట్ పోటీలను ఎమ్మెల్యే మేఘారెడ్డితో కలిసి ప్రారంభించి మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించారని.. అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని వివరించారు. అనంతరం స్థానిక కార్యకర్తలతో మాట్లాడి స్థానిక విషయాలు, ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట నాయకులు సత్యశిలారెడ్డి, కొంకి వెంకటేశ్, శివన్న, కొంకి రమేశ్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
‘రైతు హామీలు నెరవేర్చాలి’