
అసంపూర్తిగా.. అధ్వానంగా
ఏడాది దాటినా పూర్తికాని ఖిల్లాఘనపురం–వెల్కిచర్ల రహదారి పనులు
ఖిల్లాఘనపురం: మండల కేంద్రం నుంచి పర్వతాపురం, అప్పారెడ్డిపల్లి, మామిడిమాడ, సల్కెలాపురం గ్రామాల మీదుగా భూత్పూర్ మండలం వెల్కిచర్ల వరకు ఆర్‌అండ్‌బీ రహదారి పనులు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో వాహనదారులు, ప్రయాణికులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు రోడ్డుపై నీరు నిలిచి కుంటలను తలపించాయి.
అసంపూర్తి పనులతో..
ఖిల్లాఘనపురం నుంచి పర్వతాపురం మీదుగా వెళ్లే బీటీ రోడ్డు పునరుద్ధరణ పనులకుగాను ప్రభుత్వం ఆర్‌అండ్‌బీ నిధులు రూ.2.60 కోట్లు మంజూరు చేసింది. టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ కల్వర్టు నిర్మాణాలు చేపట్టి వదిలేశారు. ప్రజాప్రతినిధులు, ప్రజల నుంచి వత్తిడి పెరగడంతో రోడ్డుకు ఇరువైపులా కొంతదూరం మొర్రం పోశారు. కానీ రహదారి పనులు మాత్రం ప్రారంభించడం లేదు.
అధ్వాన రహదారితో..
మండల కేంద్రం నుంచి పర్వతాపురం వరకు ఉన్న 6 కిలోమీటర్ల బీటీ రోడ్డు అధ్వానంగా మారింది. రోడ్డుకు కొంతదూరం మొర్రం పోసి వదిలేయడంతో పెద్ద వాహనాలు వెళ్లినప్పుడు పెద్దఎత్తున దుమ్మలేస్తోంది. అలాగే ద్విచక్ర వాహనదారులు రాత్రిళ్లు ప్రమాదాల బారిన పడుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి కాంట్రాక్టర్‌పై వత్తిడి తీసుకొచ్చి పనులు త్వరగా పూర్తి చేసేలా చూడాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
ఇబ్బందులు పడుతున్నాం..
గ్రామం నుంచి మండల కేంద్రానికి రోజు వేల సంఖ్యలో ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. రోడ్డు మరమ్మతులో భాగంగా చాలాచోట్ల మొర్రం పోసి వదిలేయడంతో ద్విచక్ర వాహనదారులు అదుపుతప్పి కిందపడి గాయాల పాలవుతున్నారు. భారీ వాహనాలు వెళ్తుంటే పెద్ద ఎత్తున దుమ్ములేస్తోంది. అధికారులు స్పందించి పనులు పూర్తి చేయించాలి.
– గోవర్ధన్‌రెడ్డి, పర్వతాపురం
ఉన్నతాధికారులకు
విన్నవించాం..
ఖిల్లాఘనపురం నుంచి వెల్కిచర్ల వరకు బీటీ రహదారి పనులను రెండు భాగాలుగా టెండర్ పిలిచాం. ఇప్పటి వరకు ఓ భాగం పనులు పూర్తయ్యాయి. మండల కేంద్రం నుంచి పర్వతాపురం వరకు ఉన్న రహదారి పనులను కాంట్రాక్టర్ చేయడం లేదు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. కాంట్రాక్టర్‌తో మాట్లాడాం.. పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటాం.
– రాకేష్, ఏఈ, ఆర్‌అండ్‌బీ శాఖ
రూ.2.60 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం
రాకపోకలకు తప్పని అవస్థలు
పట్టించుకోని అధికారులు

అసంపూర్తిగా.. అధ్వానంగా

అసంపూర్తిగా.. అధ్వానంగా

అసంపూర్తిగా.. అధ్వానంగా