వనపర్తి: 2025–26 సంవత్సరానికి సంబంధించి జిల్లాలో ఆయిల్‌పాం సాగు లక్ష్యం 6,548 ఎకరాలు సాధించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పంట సాగుతో కలిగే లాభాలను రైతులకు వివరించి పంట మార్పిడి చేసేలా చూడాలని.. ఏమైనా అపోహలుంటే తొలగించాలని సూచించారు. వ్యవసాయ అధికారులకు మండలాల వారీగా లక్ష్యాలిచ్చి పర్యవేక్షణ చేయాలని జిల్లా వ్యవసాయ అధికారిని ఆదేశించారు. అదేవిధంగా కొత్తకోట మండలం సంకిరెడ్డిపల్లిలో ఆయిల్‌పాం ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణ పనులు వేగంగా సాగేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్‌నాయక్, జిల్లా ఉద్యాన అధికారి అక్బర్, ఎంఏఓలు, ఉద్యానశాఖ అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment