శ్రీశైల మల్లన్నకు పట్టువస్త్రాలు
● ఆలయ ఈఓకు అందజేసిన పద్మశాలి కులస్థులు
అమరచింత: మహా శివరాత్రి సందర్భంగా శ్రీశైలంలో పట్టణ పద్మశాలీలు భక్తిశ్రద్ధలతో తయారు చేసిన పట్టువస్త్రాలను సోమవారం మహంకాళి శ్రీనివాసులు, సవితారాణి దంపతులు ఆలయ ఈఓకు అందజేశారు. పద్మశాలి భవన్‌లో పట్టువస్త్రాలకు పూజలు నిర్వహించిన అనంతరం తలపై పెట్టుకొని మేళతాళాలతో ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. అక్కడ పూజలు చేసి ఆలయ ఈఓకు సమర్పించారు. వీటిని శివరాత్రి రోజున స్వామి, అమ్మవారికి అలంకరిస్తారు. కార్యక్రమంలో పద్మశాలి సత్రం కమిటీ సభ్యుడు కర్నాటి శ్రీధర్, మహంకాళి సత్యనారాయణ, ఎల్లప్ప తదితరులు పాల్గొన్నారు.
‘త్రివేణి సంగమ
జలాలు పవిత్రం’
వనపర్తిటౌన్: త్రివేణి సంగమంలోని జలాలు పరమ పవిత్రమని ప్రముఖ గురువు ఆదిత్యా పరాశ్రీ స్వామిజీ అన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలోని పెంటగాన్ సమీపంలో కుంభమేళా నుంచి తీసుకొచ్చిన జలాల సంప్రోక్షణ కార్యక్రమం పోచ రవీందర్‌రెడ్డి నేతృత్వంలో నిర్వహించగా.. ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కుంభమేళాకు వెళ్లలేని వారికి ఈ పవిత్ర జలాలు అందించాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం చేపపట్టినట్లు వివరించారు. సజ్జన సాంగత్యంతోనే ధర్మమార్గానికి బాటలు పడతాయని.. సజ్జనులు కుంభమేళా జలాలు ప్రతి ఒక్కరికి చేరేందుకు చేస్తున్న ప్రయత్నం అభినందనీయమని కొనియాడారు. కార్యక్రమంలో జీజే శ్రీనివాసులు, వామన్‌గౌడ్, కేవీ రమణ, సదానందగౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, సుఖేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
బీజేపీ దీక్ష..
భగ్నం చేసిన పోలీసులు
కొత్తకోట: పట్టణంలోని సమస్యల సాధనకై బీజేపీ ఆధ్వర్యంలో సోమవారం చేపట్టిన దీక్షను మాజీ ఎమ్మెల్యే రావుల రవీంద్రనాథ్‌రెడ్డి పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పురపాలికలో గతేడాది టెండర్లు పిలిచిన అభివృద్ధి పనులను తక్షణమే ప్రారంభించాలని కోరారు. నిధులు మంజూరైనా పుర అధికారులు, పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. దీక్షకు మాజీ కౌన్సిలర్ కొమ్ము భరత్‌భూషణ్ పూనుకోగా చీర్ల తిరుపతయ్య సాగర్, రాజమౌళి, లక్ష్మణ్‌లు పాల్గొన్నారు. పబ్బ నరేందర్‌గౌడ్, సబిరెడ్డి వెంకట్‌రెడ్డి, కోటేశ్వర్‌రెడ్డి, వనపర్తి శ్రీనివాస్‌రెడ్డి, కొమ్ము సురేశ్, మొగిలన్న, సతీష్ వారికి సంఘీభావం తెలిపారు. ఇదిలా ఉండగా.. ఎలాంటి అనుమతి లేకుండా దీక్ష చేపట్టారంటూ పోలీసులు వారిని అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సాయంత్రం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.
శ్రీశైల మల్లన్నకు పట్టువస్త్రాలు
శ్రీశైల మల్లన్నకు పట్టువస్త్రాలు
Comments
Please login to add a commentAdd a comment