
వెంచర్ల ఏర్పాటులో నిబంధనలు పాటించాలి
ఆత్మకూర్: వెంచర్ల ఏర్పాటులో ప్రభుత్వ నిబంధనలు విధిగా పాటించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం పట్టణంలోని భార్గవినగర్, బీసీకాలనీలో ఏర్పాటు చేస్తున్న వెంచర్లలో హద్దులు, విద్యుత్, ఇరిగేషన్, రహదారుల నిర్మాణాలను పరిశీలించి ఆయా శాఖల అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజా అవసరాలకు అనుగుణంగా లేఅవుట్లు ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ నిబంధనలు అతిక్రమిస్తే అనుమతులు రద్దు చేస్తామని వివరించారు. ఆయన వెంట ట్రాన్స్‌కో ఎస్‌ఈ రాజశేఖరం, ఏఈ నర్సింహ, నీటిపారుదలశాఖ ఏఈ కిషోర్, ఆర్‌అండ్‌బీ డీఈ సీతారామస్వామి, తహసీల్దార్ చాంద్‌పాషా, పుర కమిషనర్ శశిధర్, ఎంపీడీఓ శ్రీపాద్, టీపీఓ కరుణాకర్ తదితరులు ఉన్నారు.
పౌల్ట్రీ ఫాం పరిశీలన
ఆత్మకూర్: బర్డ్‌ఫ్లూ వైరస్‌తో కోళ్లు చనిపోతున్నాయని.. చికెన్ తినడం మానుకోవాలని జిల్లా పశువైద్యాధికారి డా. వెంకటేశ్వర్‌రెడ్డి సూచించారు. మండలంలోని పిన్నంచర్లలో ఉన్న పౌల్టీ ఫాంలో కోళ్లు చనిపోవడంతో శుక్రవారం ఆయన ఎంపీడీఓ శ్రీపాద్, ఎంపీఓ శ్రీరాంరెడ్డి, పశువైద్యాధికారి డా. రమేశ్‌తో పరిశీలించారు. ఫాం పరిసరాలను పరిశీలించి బ్లీచింగ్ పౌడర్ చల్లించి గ్రామంలోని చికెన్ దుకాణాలను మూయించారు. ఆత్మకూర్‌లో సైతం చికెన్ అమ్మకాలు నిలిపివేయాలని, దుకాణాలను మూసివేయించాలని పుర కమిషనర్ శశిధర్‌కు సూచించారు. ఆయనవెంట జేవీఓ నిర్మల, ఏఎస్‌లు నాగరాజు, మహిమూద్ ఉన్నారు.
3న జాతీయ సదస్సు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: మహబూబ్‌నగర్ సమీపంలోని క్రిస్టియన్‌పల్లిలో ఉన్న ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలో ‘తెలంగాణ ఆర్థికాభివృద్ధి, అవకాశాలు.. సవాళ్లు, ఎంఎస్‌ఎంఈల పాత్ర’ అనే అంశంపై మార్చి 3న జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ పద్మావతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమానికి పీయూ వీసీ శ్రీనివాస్, కంట్రోలర్ రాజ్‌కుమార్ తదితరులు హాజరవుతారన్నారు.

వెంచర్ల ఏర్పాటులో నిబంధనలు పాటించాలి
Comments
Please login to add a commentAdd a comment