
గిరిజనులకు ఉచిత న్యాయ సేవలు
కొత్తకోట రూరల్: గిరిజనులకు ఉచిత న్యాయ సేవలు అందిస్తున్నామని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ న్యాయమూర్తి వి.రజని అన్నారు. శుక్రవారం పెద్దమందడి మండలం చీకురుచెట్టుతండాలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో గిరిజనులకు చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై జిల్లా న్యాయ సేవాసంస్థ పనితీరు, గిరిజనుల హక్కులు, చట్టాల గురించి క్షుణ్ణంగా వివరించారు. బాల్య వివాహాలు, పోక్సో, రహదారి నిబంధనలు, బాల కార్మికుల చట్టం గురించి అవగాహన కల్పించారు. గిరిజనులతో పాటు హరిజనులు, మహిళలు, పిల్లలు, వయో వృద్ధులకు కూడా ఉచిత న్యాయసేవలు అందిస్తున్నామని.. వివరాల కోసం టోల్ ఫ్రీ నంబర్ 15100 సంప్రదించాలని సూచించారు. అనంతరం మానసిక వైద్యులు డా. పుష్పలత మాట్లాడుతూ.. మానసిక సమస్యలతో బాధపడుతున్న వారిని భూత వైద్యుల వద్దకు కాకుండా జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఉన్న మానసిక వైద్య నిపుణుల వద్దకు తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇప్పించాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ ఎల్‌ఏడీసీఎస్ జి.ఉత్తరయ్య, సఖి లీగల్ కౌన్సిల్ డి.కృష్ణయ్య, పారా లీగల్ వలంటీర్ అహ్మద్, మాజీ సర్ప ంచ్ రాధాకృష్ణ, పంచాయతీ కార్యదర్శి ప్రీతి, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment