
ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్‌గా యాదయ్య
వనపర్తి: స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ నారాయణపేటకు బదిలీ కావడంతో జెడ్పీ సీఈఓ యాదయ్యకు ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగిస్తూ కలెక్టర్ ఆదర్శ్ సురభి ఉత్తర్వులు జారీ చేశారు. శుక్రవారం బాధ్యతలు చేపట్టిన అనంతరం కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
మార్కెట్ యార్డు
నిర్మాణ స్థలం మార్పు
ఖిల్లాఘనపురం: ఖిల్లాఘనపురం, పెద్దమందడి మండలాలకు కలిపి ప్రభుత్వం వ్యవసాయ మార్కెట్ యార్డును మంజూరు చేసింది. మొదట మార్కెట్ యార్డును షాపురం గ్రామానికి వెళ్లే కూడలిలో ఉన్న ప్రభుత్వ స్థలంలో నిర్మించాలని నిర్ణయించారు. శిలా ఫలకం నిర్మాణం, ఏర్పాట్లను పరిశీలించేందుకు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, డీసీసీబీ చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి, జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాసులుగౌడ్ శుక్రవారం సాయంత్రం అక్కడికి చేరుకున్నారు. మార్కెట్‌యార్డును మండల కేంద్రంలో ఏర్పాటు చేయాలంటూ స్థానికులతో పాటు అటువైపు ఉన్న గ్రామాల నాయకులు ఏర్పాట్లను పరిశీలించేందుకు రాకుండా పద్మశాలి కళ్యాణ మండపం దగ్గర అలిగి కూర్చున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వారికి ఫోన్‌లో నచ్చజెప్పేందుకు యత్నించినా వారు ఒప్పుకోకపోవడంతో చేసేది లేక నేరుగా అక్కడికి చేరుకున్నారు. మండల కేంద్రంలోనే ఏర్పాటు చేస్తే ఎక్కువ మంది రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని నాయకులు, రైతులు పట్టుబట్టారు. నిర్మాణానికి అవసరమైన స్థలం చౌడమ్మ గుట్ట దగ్గర ఉండటంతో ఎమ్మెల్యేతో పాటు నాయకులు వెళ్లి పరిశీలించారు. నిర్మాణానికి ఎమ్మెల్యే అంగీకరించడంతో నాయకులు, రైతులు ఆయనను శాలువాతో సన్మానించారు. శిలా ఫలకం ఏర్పాటుకు స్థలాన్ని శుభ్రం చేసే పనులను నాయకులు వెంటనే ప్రారంభించారు. మాజీ ఎంపీపీ క్యామ వెంకటయ్య, మాజీ సింగిల్‌విండో చైర్మన్ వెంకటేశ్వర్‌రావు, సింగిల్‌విండో వైస్ చైర్మన్ రాజు, కాంగ్రెస్‌పార్టీ మండల అధ్యక్షుడు విజయ్‌కుమార్, సాయిచరణ్‌రెడ్డి, నాయకులు ఉన్నారు.
అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా
పాలమూరు: జిల్లాలో విద్యుత్ డిమాండ్ గతేడాది కంటే ఈసారి 18 శాతం పెరిగిందని, ఎలాంటి అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్, ఎండీ ముషారఫ్ ఫారూఖీ అన్నారు. జిల్లాలో విద్యుత్ శాఖ వేసవి యాక్షన్ ప్లాన్ పనులను శుక్రవారం పరిశీలించడంతోపాటు టీడీగుట్ట సబ్‌స్టేషన్‌లో దాదాపు రూ.కోటి వ్యయంతో అదనంగా ఏర్పాటు చేసిన ఐదు ఎంవీఏ ఫవర్ ట్రాన్స్‌ఫార్మర్లను కలెక్టర్ విజయేందిరతో కలిసి సీఎండీ ప్రారంభించారు. అనంతరం కలెక్టరేట్‌లో విద్యుత్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గతేడాది పీక్ డిమాండ్ 352 మెగావాట్లు కాగా ఈసారి 415 మెగావాట్లకు చేరిందని, ఇంతగా డిమాండ్ పెరిగినా ఎలాంటి ఓవర్‌లోడ్ సమస్య లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు. డిమాండ్ 500 మెగావాట్లకు చేరిన సరఫరా చేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. జిల్లాలో గృహ, వాణిజ్య, పారిశ్రామిక, వ్యవసాయ రంగంలో విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతుందని, గతేడాదితో పోల్చితే ఈసారి జనవరి వరకు దాదాపు 15 వేల మంది చేరికతో మొత్తం వినియోగదారులు 3.99 లక్షలకు చేరారని, గృహాజ్యోతి పథకం కింద దాదాపు 1.29 లక్షల మంది గృహ వినియోగదారులు లబ్ధిపొందుతున్నారని చెప్పారు. గతేడాది దాదాపు 9 సబ్‌స్టేషన్ల్ పరిధిలో ఫవర్ ట్రాన్స్‌ఫార్మర్లు ఓవర్ లోడ్ అయ్యాయని, డివిజన్ల వారీగా పెరుగుతున్న లోడ్‌లకు తగ్గట్టుగా నూతన ట్రాన్స్‌ఫార్మర్, ఫీడర్ల విభజన చేయడం జరిగిందన్నారు. కేవలం హైదరాబాద్‌కు పరిమితమైన విద్యుత్ కాల్ సెంటర్ 1912 సదుపాయాన్ని జిల్లాలకు విస్తరించామన్నారు. విద్యుత్ అంతరాయాలు జరిగిన వెంటనే సమస్య పరిష్కరించేందుకు అంబులెన్స్ తరహా వాహనాలు ఏర్పాటు చేశామన్నారు. విద్యుత్ సమస్య ఉంటే వినియోగదారులు 1912 ఫిర్యాదు చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, డైరెక్టర్ ఆపరేషన్ నర్సింహులు, రూరల్ జోన్ చీఫ్ ఇంజినీర్ బాలస్వామి, ఎస్‌ఈ రమేష్ పాల్గొన్నారు.

ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్‌గా యాదయ్య

ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్‌గా యాదయ్య
Comments
Please login to add a commentAdd a comment