ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్దకు శుక్రవారం రామగుండం, కొత్తగూడెం నుంచి అదనంగా సింగరేణి బృందాలు చేరుకున్నాయి. సింగరేణి కార్మికులు ఎక్కువగా కష్టపడుతూ సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు సింగరేణి కార్మికులు సొరంగంలో బురద మట్టిని తొలగించడానికి శాయశక్తులా పనిచేశారు. సింగరేణి కార్మికులు విడతల వారీగా సొరంగంలోకి వెళ్లి పనులు చేపడుతున్నారు. వీరితో పాటు ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, హైడ్రా, ఆర్మీ, నేవీ, ర్యాట్ హోల్ మైనర్స్, బీఆర్‌ఓ, రైల్వే శాఖతో పాటు పలు ప్రైవేట్ నిర్మాణ సంస్థలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి.
● అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం టన్నెల్‌లో 11.560 కి.మీ., నుంచి 12.950 కి.మీ., వరకు వాటర్, బురద పేరుకుపోగా.. రెండు రోజులుగా వీటిని తొలగిస్తున్నారు. అలాగే 150 మీటర్ల మేర పేరుకున్న మట్టి, బురద, రాళ్లు, సెగ్మెంట్, టీబీఎం శిథిలాలను తొలగించే చర్యలు ముమ్మరం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment