
25 శాతం రాయితీపై విస్తృత ప్రచారం
వనపర్తి: ప్లాట్లు, లేఅవుట్ల క్రమబద్దీకరణకు నెలాఖరు వరకు 25 శాతం రాయితీ ఇస్తున్నట్లు పురపాలికల్లో విస్తృత ప్రచారం చేస్తున్నామని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి పురపాలికశాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్పరెన్స్ నిర్వహించగా.. జిల్లా నుంచి కలెక్టర్, ఇన్‌చార్జ్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య పాల్గొని వివరాలు వెల్లడించారు. జిల్లాలో 48 వేల మంది ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకుని కేవలం 160 మంది మాత్రమే డబ్బులు చెల్లించేందుకు ముందుకొచ్చారని వివరించారు. గడువు ముగిసిన తర్వాత ప్రస్తుత మార్కెట్ విలువకు 14 శాతం అదనంగా చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుందని అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో పుర కమిషనర్ వెంకటేశ్వర్లు, సబ్ రిజిస్ట్రార్ చంద్రశేఖర్‌రెడ్డి, మిగతా పురపాలికల కమిషనర్లు, పట్టణ ప్రణాళిక ఇంజినీర్లు పాల్గొన్నారు.
నేడు జాన్‌వెస్లీ రాక
వనపర్తి రూరల్: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ శనివారం జిల్లాకేంద్రానికి రానున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి పుట్టా ఆంజనేయులు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని పలు కాలనీల్లో ప్రజా సమస్యలపై కొనసాగుతున్న సర్వేలో పాల్గొంటారని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment