పక్కాగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు
ఆత్మకూర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పక్కా ప్రణాళికతో చేపట్టనున్నామని జిల్లా హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ పర్వతాలు తెలిపారు. సోమవారం మండలంలోని దేవరపల్లిలో గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట ఇందిరమ్మ ఇంటి నిర్మాణంపై గ్రామస్తులకు ముగ్గుపోసి అవగాహన కల్పించారు. ఇంటి నిర్మాణానికి సంబంధించి నాలుగు దశల్లో బిల్లు చెల్లిస్తారని.. మార్కింగ్, బేస్‌మెంట్, రూఫ్ లేవల్, నిర్మాణం పూర్తయిన అనంతరం పూర్తిస్థాయిలో లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో డబ్బులు జమవుతాయన్నారు. లబ్ధిదారులకు ఏవైనా అనుమానాలు ఉంటే ఎంపీడీఓ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీపాద్, ఎంపీఓ శ్రీరాంరెడ్డి, పంచాయతీ కార్యదర్శి నరేశ్, గ్రామస్తులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment