ప్రయోగాలతో మేధాశక్తి పెంపొందుతుంది
పాన్‌గల్: విద్యార్థులకు చార్ట్‌ల ద్వారా బోధన అందించడంతో మేధాశక్తి, ప్రతిభ పెంపొందుతుందని జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘనీ అన్నారు. మంగళవారం మండలంలోని తెల్లరాళ్లపల్లి లిటిల్ స్టార్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సైన్స్ ఫేర్‌ను ఆయన ప్రారంభించి విద్యార్థుల ప్రయోగాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రయోగాల ద్వారా ఆలోచన విధానం పెరుగుతుందని.. ఇలాంటి ప్రదర్శనలతో తోటి విద్యార్థులకు ప్రేరణ కలుగుతుందన్నారు. విద్యార్థులు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని, నిత్య జీవితంలో సైన్స్ ఉపయోగంపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. విద్యార్థుల ఆలోచనలకు అనుగుణంగా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని కోరారు. కార్యక్రమంలో ఎంఈఓ శ్రీనివాసులు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.
చెరుకు రైతులకు
బకాయిలు చెల్లించండి
అమరచింత: చెరుకు రైతులకు వెంటనే బకాయి డబ్బులు చెల్లించాలని చెరుకు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జీఎస్ గోపి కృష్ణవేణి షుగర్ ఫ్యాక్టరీ డీజీఎం మురళికి మంగళవారం వినతిపత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. 2010–11 సంవత్సరం నుంచి రైతులు చెరుగు సాగు చేయడం ప్రారంభించారని తెలిపారు. మొదట్లో డ్రిప్, విత్తనాలు రాయితీపై అందించడమేగాక పెట్టుబడి సాయం ఇచ్చారని.. ఇప్పుడు అన్నీ ఎత్తివేసి మద్దతు ధర కూడా ఇవ్వకుండానే పంట కోతలు చేపడుతున్నారని వివరించారు. పంట కోతలు జరిగి 40 రోజులవుతున్నా నేటికీ డబ్బులు చెల్లించడం లేదని వివరించారు. 15 రోజుల్లో డబ్బులు చెల్లించకుంటే 16 శాతం వడ్డీతో చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎండీ జబ్బార్, నాయకులు అరుణ్, వెంకట్రాములు, వెంకటేశ్వర్లు, శివలక్ష్మి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
వ్యవసాయ విస్తరణ
అధికారుల జిల్లా కార్యవర్గం
వనపర్తి రూరల్: మండలంలోని చిట్యాల రైతువేదికలో మంగళవారం వ్యవసాయ విస్తరణ అధికారుల జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా నందకిషోర్‌రెడ్డి, అసోసియేట్ అధ్యక్షుడిగా ఫెరోజ్, ఉపాధ్యక్షులుగా అనిత, శైలజ, ప్రధానకార్యదర్శిగా సంతోష్, కోశాధికారిగా ఎన్. మోహన్‌నాయక్, కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు మాట్లాడుతూ.. వ్యవసాయ విస్తరణ అధికారుల సమస్యల సాధనే ధ్యేయంగా పోరాడుతామని తెలిపారు.
‘చిన్నారెడ్డిని
విమర్శించడం తగదు’
వనపర్తిటౌన్: చిన్నారెడ్డిని విమర్శిస్తే పదవులు రావని.. ప్రజల మన్ననలు పొందితేనే పదవులు వస్తాయనే విషయాన్ని నాయకులు గుర్తించాలని డీసీసీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ తెలిపారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కష్టకాలంలో చిన్నారెడ్డి జోడోయాత్ర, వరంగల్ డిక్లరేషన్, గ్రామ, మండల కమిటీలు వేస్తూ కాంగ్రెస్‌పార్టీ క్యాడర్‌ని నిలబెట్టి గెలుపు గ్రాఫ్‌ను పెంచారని.. ఆయన కృషి ఫలితమే ఎమ్మెల్యే మేఘారెడ్డి అని వివరించారు. గోపాలపేట మాజీ ఎంపీపీ ప్రభావతి చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కార్యక్రమంలో గోపాలపేట జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రాజేశ్వర్‌రెడ్డి, ఓబీసీ జిల్లా అధ్యక్షుడు కోట్ల రవి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బి.కృష్ణ, సీనియర్ నాయకులు చీర్ల జనార్దన్, భాస్కర్‌రావు, శేఖర్, శాంతన్న, లీలావతి, పట్టణ కార్యనిర్వాహక అధ్యక్షుడు కదిరే రాములు తదితరులు పాల్గొన్నారు.
ప్రయోగాలతో మేధాశక్తి పెంపొందుతుంది
ప్రయోగాలతో మేధాశక్తి పెంపొందుతుంది
ప్రయోగాలతో మేధాశక్తి పెంపొందుతుంది
Comments
Please login to add a commentAdd a comment