
‘యూపీఎస్‌పై యుద్ధభేరి’ జయప్రదం చేయండి
పాన్‌గల్: తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద చేపట్టే ‘యూపీఎస్‌పై యుద్ధభేరి’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు బౌద్దారెడ్డి, సీపీఎస్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మద్దిలేటి, చింతకుంట పాఠశాల జీహెచ్‌ఎం షేక్యానాయక్ పిలుపునిచ్చారు. శుక్రవారం మండలంలోని చింతకుంట ఉన్నత పాఠశాల ఆవరణలో ధర్నాకు సంబంధించిన వాల్‌పోస్టర్లను వారు ఆవిష్కరించి మాట్లాడారు. జిల్లాలోని అన్ని మండలాల నుంచి సీపీఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు కార్యక్రమానికి భారీగా తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో టీఎస్‌సీపీఎస్‌ఈయూ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య, మనోహర్‌గౌడ్, భాస్కర్‌రెడ్డి, బక్కన్న, కుర్మయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment