విద్యాపర్తి సిగలో..
జిల్లాకేంద్రంలో ఏర్పాటుకానున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల
వనపర్తి: పేద, మధ్యతరగతి విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్యనందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పలు జిల్లాలకు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు మంజూరు చేసిన విషయం తెలిసిందే. జిల్లాకు కూడా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు కావడంతో విద్యలో మరో అడుగు ముందుకు పడినట్లు విశ్లేషకులు విద్యావంతులు మేధావులు అభిప్రాయపడుతున్నారు. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రత్యేక శ్రద్ధతో ముఖ్యమంత్రిని ఒప్పించి జిల్లాకు పాఠశాలతో పాటు భవన నిర్మాణానికి రూ.200 కోట్లు మంజూరు చేయించారు. ఈ పాఠశాల భవన నిర్మాణానికి జిల్లాకేంద్రంలోని పీర్లగుట్ట ప్రాంతాన్ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
ఇదీ లక్ష్యం..
జిల్లాలో చాలా గురుకుల పాఠశాలలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. దీంతో సరైన వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి వాటిన అధిగమించి బడుగు, బలహీన, మైనార్టీ వర్గాల విద్యార్థులను ఒకే గొడుగు కిందకు తెచ్చి బోధన అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. సుమారు రూ.200 కోట్ల వ్యయంతో 20 నుంచి 25 ఎకరాల స్థలంలో నిర్మించాలన్నదే లక్ష్యం. ఈ క్యాంపస్‌లో తరగతి గదులు, డార్మెంటరీలు, ల్యాబ్స్, క్రీడా మైదానాలు, అవుట్‌డోర్ జిమ్, థియేటర్ తదితర సౌకర్యాలు కల్పించనున్నారు.
శంకుస్థాపన చేయనున్న ముఖ్యమంత్రి..
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చదువుకున్న వనపర్తిలో తొలి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మార్చి 2న జిల్లా పర్యటనలో పాఠశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.
కార్పొరేట్‌స్థాయిలో బోధన అందించేందుకే..
వనపర్తి ప్రాంత పేద, మధ్యతరగతి విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో నాణ్యమైన ఉచిత విద్య అందించేందుకు ప్రయత్నం చేస్తున్నాం. విద్యాపర్తిని మరింత అభివృద్ధి చేయాలన్నదే ప్రధాన లక్ష్యం. అందులో భాగంగానే సీఎం రేవంత్‌రెడ్డిని ఒప్పించి జిల్లాకు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలను మంజూరు చేయించాను.
– తూడి మేఘారెడ్డి, ఎమ్మెల్యే, వనపర్తి
‘వనపర్తికి విద్యాపర్తిగా పేరుంది.
జిల్లాకేంద్రంగా మారిన తర్వాత జేఎన్‌టీయూ
ఇంజినీరింగ్ కళాశాలతో పాటు ప్రభుత్వ వైద్య, నర్సింగ్, ఫిషరీస్ తదితర కళాశాలలు ఏర్పాటయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల కూడా మంజూరు చేసింది.’
రూ.200 కోట్లతో భవన నిర్మాణం
శంకుస్థాపన చేయనున్న ముఖ్యమంత్రి
విద్యాపర్తి సిగలో..
Comments
Please login to add a commentAdd a comment