
సైబర్ నేరాలపై అవగాహన ఉండాలి
వనపర్తి: సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలని సైబర్ క్రైం డీఎస్పీ ఎన్‌బీ రత్నం సూచించారు. బుధవారం జిల్లాకేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో ౖనిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్ట్, సైబర్ స్టాకింగ్, వర్క్ ఫ్రం హోం పేరుతో మనల్ని ఆకర్షితులను చేస్తూ, కొన్నిసార్లు భయభ్రాంతులకు గురిచేస్తూ డబ్బులు కాజేస్తారన్నారు. గుర్తుతెలియని వ్యక్తుల ఫోన్ కాల్స్‌కు స్పందించవద్దని సూచించారు. ఒకవేళ డబ్బులు నష్టపోతే వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కి ఫిర్యాదు చేయాలన్నారు. నేటి సమాజంలో ఇంటర్నెట్ వినియోగం పెరిగిందని, వ్యక్తిగత సమాచారాన్ని సోషల్ మీడియాలో నమోదు చేయొద్దని సూచించారు. విద్యార్థులు బెట్టింగ్ యాప్‌లకు దూరంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో పట్టణ ఎస్‌ఐ హరిప్రసాద్, సైబర్ క్రైం ఎస్‌ఐ రవిప్రకాష్, ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment