
అట్టహాసంగా బండలాగుడు పోటీలు
పాన్‌గల్: మహా శివరాత్రి సందర్భంగా బుధవారం మండలంలోని రేమద్దులలో హమాలీ సంఘం ఆధ్వర్యంలో అంతర్రాష్ట్ర బండలాగుడు పోటీలు నిర్వహించారు. మొత్తం 8 జతల ఎద్దులు పాల్గొనగా ప్రథమ స్థానంలో నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం పీఆర్‌పల్లికి చెందిన ఎం.నాగయ్య ఎద్దులు.. ద్వితీయ స్థానంలో కర్నూలు జిల్లా కోడుమూరు మండలం వల్కూరు గ్రామానికి చెందిన దొడ్డికాటి తిరుమల్లేష్ ఎద్దులు.. తృతీయ స్థానంలో కర్నూలు జిల్లా ఎమ్మిగనూర్ మండలం గుడికల్‌కు చెందిన దాసు ఎద్దులు.. నాలుగో స్థానంలో రంగారెడ్డి జిల్లా చౌదరిగూడెం గ్రామానికి చెందిన వెంకటేష్‌యాదవ్ ఎద్దులు.. ఐదో స్థానంలో చిన్నంబావి మండలం పెద్దదగడకు చెందిన గోపాలకృష్ణ ఎద్దులు విజేతలుగా నిలిచాయి. ప్రథమ బహుమతి రూ.60 వేలు, ద్వితీయ బహుమతిగా రూ.50 వేలు, తృతీయ బహుమతిగా రూ.40 వేలు, నాలుగో బహుమతిగా రూ.30 వేలు, ఐదో బహుమతిగా రూ.20 వేలు అందజేశారు. కార్యక్రమంలో నాయకులు గోపాల్‌రావు, మధుసూదన్‌రెడ్డి, ప్రసాద్‌రావు, దామోదర్‌రెడ్డి, కతాల్, తిరుపతయ్య, బక్కిరెడ్డి, హమాలీ సంఘం నాయకులు శాంతయ్య, రాములు వ్యాఖ్యాత శివశంకర్‌రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment