
మార్చి 8న జాతీయ లోక్ అదాలత్
వనపర్తి టౌన్: జాతీయ లోక్ అదాలత్‌లో సత్వర పరిష్కారం లభిస్తుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్ సునీత తెలిపారు. సోమవారం జిల్లా న్యాయస్థానంలో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన పోలీస్ అధికారుల సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. మార్చి 8న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని.. సాధ్యమైనన్ని కేసులు రాజీ మార్గంలో పరిష్కరించే విధంగా చూడాలని కోరారు. కక్షిదారులను సంప్రదించి రాజీ కుదర్చాలని సూచించారు. సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వి.రజని, అన్ని న్యాయస్థానాల న్యాయమూర్తులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment