
సీసీరోడ్ల నిర్మాణంలో నాణ్యత తప్పనిసరి
ఖిల్లాఘనపురం: సీసీరోడ్ల నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని పంచాయతీరాజ్ డీఈ లక్ష్మీనారాయణరెడ్డి అన్నారు. సోమవారం ఖిల్లాఘనపురం, వెంకటాంపల్లి గ్రామాల్లో ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులు రూ. 10లక్షలతో నిర్మించిన సీసీరోడ్లను ఏఈ రమేష్ నాయుడుతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా డీఈ మాట్లాడుతూ.. ప్రస్తుతం జిల్లాలో ఎస్సీ సబ్‌ప్లాన్, ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులతో సీసీరోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ పనులు కొనసాగుతున్నాయని చెప్పారు.
పోరాటాలతోనే
హక్కుల సాధన
వనపర్తి రూరల్: పోరాటాలతోనే కార్మికుల హక్కులు సాధ్యమవుతాయని ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి నర్సింహ్మ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఏఐటీయూసీ కార్యాలయంలో సెకండ్ ఏఎన్‌ఎంల సంఘం జిల్లా అధ్యక్షురాలు కృష్ణవేణి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. కార్మికవర్గం సంఘటితంగా పోరాడితేనే పాలక వర్గాలు దిగివస్తాయన్నారు. సెకండ్ ఏఎన్‌ఎంలకు వందశాతం గ్రాస్ శాలరీతో పాటు ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించాలని.. ఏఎన్‌ఎంల పోస్టుల సంఖ్య పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు శ్రీహరి, ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ, సెకండ్ ఏఎన్‌ఎంల సంఘం జిల్లా కార్యదర్శి లక్ష్మమ్మ, సుమిత్ర, అరుణ, మాధవి, పార్వతి, విజయ, లక్ష్మి, శివలీల, నాగలక్ష్మి, హారతి, ఈశ్వరమ్మ ఉన్నారు.
ఉపాధి హామీ కూలీలకు వసతులు కరువు
పాన్‌గల్: ఉపాధి హామీ పథకం పనులు చేపడుతున్న ప్రాంతాల్లో కనీస వసతులు లేక కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు, జిల్లా కమిటీ సభ్యుడు బాల్యానాయక్ అన్నా రు. సోమవారం మండలంలోని తెల్లరాళ్లపల్లిలో ఉపాధి హామీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. కూలీలకు సకాలంలో కూలి డబ్బు లు అందకపోవడంతో పాటు పని ప్రదేశంలో సరైన మౌలిక వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. సంబంధిత అధికారులు ఉపాఽ ది హామీ పనులను పర్యవేక్షిస్తూ.. కూలీల ఇబ్బందులను తొలగించాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు కృష్ణయ్య, సా యిలు, భీమయ్య, భగవంతు పాల్గొన్నారు.

సీసీరోడ్ల నిర్మాణంలో నాణ్యత తప్పనిసరి
Comments
Please login to add a commentAdd a comment