ప్రశాంతంగా ముగిసిన గురుకుల ప్రవేశ పరీక్ష
వనపర్తి: గురుకుల పాఠశాలల్లో 2025–26 విద్యా సంవత్సరానికిగాను 6వ తరగతిలో ప్రవేశానికి ఆదివారం నిర్వహించిన పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. మొత్తం 5,047 విద్యార్థులు పరీక్ష రాసేందుకు 9 కేంద్రాలు ఏర్పాటు చేశారని.. 4,904 మంది హాజరుకాగా, 143 మంది గైర్హాజరయ్యారని వివరించారు. 97.17 శాతం విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని తెలిపారు. మర్రికుంటలోని గిరిజన గురుకుల పాఠశాల, నాగవరం తండా వద్దనున్న అనూస్ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రాలను కలెక్టర్ తనిఖీ చేసి పరీక్షల నిర్వహణను పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment