
అక్కరకు రాని చేపల మార్కెట్..
జిల్లా కేంద్రం నడిబొడ్డున 2005లో రూ. 23లక్షలతో చేపల మార్కెట్ ప్రారంభించారు. మొదట్లో మార్కెట్ భవనాన్ని వినియోగించుకున్న మత్స్యకారులు.. తదనంతరం రోడ్లపైనే విక్రయాలు చేసేందుకు ఆసక్తి చూపడంతో మార్కెట్ భవనం ముణ్నాళ్ల ముచ్చటగా మారింది. రాజకీయ నాయకులు కొందరు రోడ్లపై విక్రయాలను ప్రోత్సహించడంతో 16 ఏళ్లుగా చేపల మార్కెట్ అక్కరకు రావడం లేదు. మార్కెట్ ఆవరణ ఆటో స్టాండ్‌గా మారింది. జిల్లా కేంద్రంలో చేపల మార్కెట్ ఉందనే విషయాన్ని చివరకు అందరూ మరిచిపోయారు. భవనం వినియోగంపై మున్సిపల్, మత్స్యశాఖ అధికారులు పెడచెవిన పెడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రూ.లక్షల ప్రజాధనంతో నిర్మించిన భవనం శిఽథిలావస్థకు చేరుకుంటున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment