చట్టాలపై అవగాహన ఉండాలి
ఖిల్లాఘనపురం: విద్యార్థులకు చట్టాలపై పూర్తిస్థాయిలో అవగాహన ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్‌జడ్జి వి.రజని అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాల, ఇంగ్లిష్ మీడియం, తెలుగు మీడియం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు చట్టాలపై పూర్తి అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషిచేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. బాల్యవివాహాలు జరిపించే వారిపై చట్టప్రకారం చర్యలు ఉంటాయన్నారు. అదే విధంగా సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అపరచిత వ్యక్తులు ఎవరైనా ఫోన్‌చేసి లాటరీ తగిలింది.. మీ ఖాతాకు డబ్బులు వస్తాయి.. ఓటీపీ చెప్పాలని అడిగితే చెప్పరాదన్నారు. ఫోన్‌లో ఏదైనా గుర్తుతెలియని లింక్ వచ్చినా ఓపెన్ చేయరాదన్నారు. ఎవరికై నా న్యాయ సేవలు అవసరమైతే 15100 టోల్‌ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. ఈ సందర్భంగా కరాటే విద్యార్థులు ప్రదర్శించిన విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఎంఈఓ జయశంకర్, హెచ్‌ఎంలు మునవర్ సుల్తానా, లలిత, ప్రశాంతి, సఖి లీగల్ కౌన్సెల్ డి.కృష్ణయ్య, పారా లీగల్ వలంటీర్ అహ్మద్, కరాటే మాస్టర్ శేఖర్, వరుణ్, శివ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment