జిల్లాలో క్షయ వ్యాధిగ్రస్తుల గుర్తింపు ప్రక్రియను ఈ నెల 17వ తేదీలోగా వందశాతం పూర్తి చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి వైద్యాధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో క్షయవ్యాధి, మిషన్ మధుమేహం, పిల్లలకు టీకాల కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 1.60 లక్షల మందికి వైద్య పరీక్షలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటి వరకు 1.26 లక్షల మందికి పరీక్షలు నిర్వహించినట్లు వివరించారు. జిల్లావ్యాప్తంగా 281 మంది క్షయ వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించడం జరిగిందన్నారు. అదే విధంగా మిషన్ మధుమేహలో భాగంగా మొత్తం 2.30 లక్షల మందికి నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటి వరకు లక్ష మందికి మాత్రమే పరీక్షలు పూర్తి చేయడం జరిగిందన్నారు. మిగిలిన వారిని ఈ నెల 20 వరకు నిర్ధారణ పరీక్షలను పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో ఇప్పటివరకు 23వేల మంది మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. పిల్లలకు సమయానుసారం ఇవ్వాల్సిన వ్యాధి నిరోధక టీకాలను సకాలంలో ఇవ్వాలని సూచించారు. టీకాలు ఏ ఒక్కటి పెండింగ్‌లో ఉండకూడదన్నారు. గర్భిణులకు సకాలంలో ఏఎన్‌సీ నమోదు చేయించడంతో పాటు ప్రభుత్వ ఆస్పత్రిలో సుఖ ప్రసవాలు జరిగే విధంగా కృషి చేయా లన్నారు. అనంతరం పోలియో రహిత సమాజం కోసం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రూపొందించిన క్యా లెండర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ శ్రీనివాస్, ప్రోగ్రాం ఆఫీసర్లు సాయినాథ్, పరిమళ, రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment