
ఆయుధ పరిజ్ఞానం పెంపొందించుకోవాలి
వనపర్తి: విధుల్లో వినియోగించే ఆయుధాలపై జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది పరిజ్ఞానం పెంపొందించుకోవాలని ఎస్పీ రావుల గిరిధర్ సూచించారు. జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం ఎరవ్రల్లిలోని 10వ బెటాలియన్‌లో గురువారం ఉదయం జిల్లా పోలీసు అధికారులు, సిబ్బందికి మూడురోజుల ఫైరింగ్ శిక్షణ నిర్వహించారు. పోలీసులు విధుల్లో వినియోగించే ఆయుధాలతో ఫైరింగ్ ప్రాక్టీస్ చేశారు. ఒక్కొక్కరు పది రౌండ్లు కాల్చే అవకాశం కల్పించారు. ఎస్పీ స్వయంగా పాల్గొని జిల్లా సాయుద దళాల అదనపు ఎస్పీ, జిల్లా పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి ఫైరింగ్ చేసి ఆయుధ నైపుణ్యాన్ని పరీక్షించుకున్నారు. ఫైరింగ్ శిక్షణలో ప్రతిభ కనబర్చిన పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆయుధాలను క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవాలని సూచించారు. వ్యాయామం చేయడం చాలా ముఖ్యమని, శక్తి సామర్థ్యాలతో ఎలాంటి అనారోగ్యానికి గురికాకుండా విధులు నిర్వర్తించవచ్చన్నా రు. చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ మంచి జీవ న విధానాన్ని అలవర్చుకోవాలని, క్రమశిక్షణతో విధులు నిర్వర్తించి జిల్లాకు, పోలీసుశాఖకు గుర్తింపు తీసుకురావాలని సూచించారు. వ్యక్తిగత, ఆరోగ్య సమస్యలు, డ్యూటీలో ఇబ్బందులు ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో వనపర్తి జిల్లా సాయుద దళ అదనపు ఎస్పీ వీరారెడ్డి, డీఎస్పీ వెంకటేశ్వరరావు, డీసీఆర్బీ డీఎస్పీ ఉమామహేశ్వరరావు, సైబర్‌క్రైం డీఎస్పీ రత్నం, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు అప్పలనాయుడు, శ్రీనివాస్, సీఐలు కృష్ణ, రాంబాబు, శివకుమార్, రిజర్వ్ ఎస్‌ఐలు వినోద్, ఎండీ మొగ్ధుం, జిల్లాలోని ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
వరుస చోరీలపై ప్రత్యేక దృష్టి..
ఆత్మకూర్: వరుస చోరీలపై ప్రత్యేక దృష్టి సారించాల ని ఎస్పీ రావుల గిరిధర్ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం స్థానిక పోలీస్‌స్టేషన్‌ను ఆ యన తనిఖీ చేసి సీఐ శివకుమార్, ఎస్‌ఐ నరేందర్‌తో మాట్లాడి కేసుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. పందుల చోరీ, కాపలాదారుడిపై దాడి, అయ్యప్పకాలనీలోని ఇంట్లో జరిగిన చోరీ తదితర కేసుల గురించి ఆరా తీశారు. పక్కాగా విచారణ చేపట్టి దొంగలను అదుపులోకి తీసుకోవాలని సూచించారు.
ఎస్పీ రావుల గిరిధర్
Comments
Please login to add a commentAdd a comment