ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటన విజయవంతం చేసేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఎస్పీ రావుల గిరిధర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లాకేంద్రంలో హెలీప్యాడ్, వాహనాల పార్కింగ్, బారికేడ్ల ఏర్పాట్లను జిల్లా పోలీసు అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం పర్యటన సజావుగా సాగేందుకు శాఖాపరంగా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. వీఐపీ, ప్రజాప్రతినిధుల వాహనాల పార్కింగ్‌కు వేర్వేరుగా అనువైన స్థలాలను గుర్తించాలని కోరారు. అవసరమైన చోట బారికేడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆయన వెంట డీఎస్పీ వెంకటేశ్వరరావు, డీసీఆర్బీ డీఎస్పీ ఉమామహేశ్వరరావు, సీఐ కృష్ణా, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు అప్పలనాయుడు, శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేష్, సీసీఎస్ సీఐ రవిపాల్, ఎస్‌ఐలు హరిప్రసాద్, జలంధర్‌రెడ్డి, నరేష్, జగన్, ట్రాఫిక్ ఎస్‌ఐ సురేందర్, పోలీసు సిబ్బంది తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment