ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి
వనపర్తి: ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకొని ముందుకు సాగాలని డీఈఓ అబ్దుల్ ఘని సూచించారు. గురువారం జిల్లా కేంద్రంలోని పీఎంశ్రీ జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాల వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీఈఓ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యతోనే వినయం, విజ్ఞానం సంపాదిస్తామన్నారు. పీఎంశ్రీ పథకం ద్వారా పాఠశాలలో అనేక వసతులను కల్పించారని.. విద్యార్థినులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థినులను సన్మానించి అభినందనలు తెలిపారు. అనంతరం విద్యార్థినులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. జిల్లా విద్యాశాఖ సమన్వయకర్తలు యుగంధర్, శేఖర్, హెచ్‌ఎం ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు.
స్థానిక సంస్థల
అదనపు కలెక్టర్ బదిలీ
వనపర్తి: జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్‌ను నారాయణపేట జిల్లాకు బదిలీ చేస్తూ గురువారం సీఎస్ శాంతకుమారి ఉత్తర్వులు జారీ చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన జిల్లాలో బాధ్యతలు చేపట్టారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించడంలో తనదైన పాత్ర పోషించారు. పలుమార్లు కలెక్టర్‌గా ఇన్‌చార్జి బాధ్యతలు నిర్వర్తించారు.
వరిధాన్యం బోనస్‌పై జాప్యం తగదు
వీపనగండ్ల: కొనుగోలు కేంద్రాల్లో సన్నరకం వరిధాన్యం అమ్మిన రైతులకు బోనస్ అందించడంలో ప్రభుత్వం జాప్యం చేయడం తగదని జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు బాల్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని బొల్లారంలో రైతులతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం కొనుగోలు చేసిన వరిధాన్యంలో ఇప్పటికీ 10 శాతం మాత్రమే బోనస్ చెల్లించిందని.. మిగతా 90 శాతం మంది రైతులకు బోనస్ అందకపోవడంతో తీవ్ర నిరాశకు గురవుతున్నారని అన్నారు. మరోవైపు దాదాపు 45 శాతం మంది రైతులకు రుణమాఫీ కాలేదన్నారు. రైతుభరోసా అందించడంలోనూ ఆలస్యం చేస్తున్నారన్నారు. ఉమ్మడి మండలంలోని జూరాల, భీ మా కాల్వలకు మార్చి నెలాఖరు వరకు వారబందీ పద్ధతిన నీటిని విడుదల చేయాలని డి మాండ్ చేశారు. సమావేశంలో రైతు సంఘం ఉ పాధ్యక్షుడు ఎం.కృష్ణయ్య, సీపీఎం నాయకులు కృష్ణయ్య, బాలాగౌడ్, తిరుపతయ్య ఉన్నారు.
మేధో సంపత్తి
హక్కులతో ప్రయోజనం
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: మేధో సంపత్తి హక్కులతో పరిశోధనలు చేసే వారికి ఎంతో ప్రయోజనం కలుగుతుందని పీయూ వీసీ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ మేరకు పీయూలో మేధో సంపత్తి హక్కులపై ఏర్పాటు చేసిన ఓరియంటేషన్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. పూర్తి స్థాయి హక్కులు పొందిన తర్వాతనే వాటిని ప్రకటించాలని, అప్పుడు ప్రచురణలు, ప్రయోగాలకు పూర్తిస్థాయిలో విలువ ఉంటుందన్నారు. ఆవిష్కరణలకు పరిరక్షణ, హక్కులు కలిగి ఉండాలంటే తప్పకుండా మేధో సంపత్తి హక్కులు ఉండాలని, రీసెర్చ్ విద్యార్థులు అధ్యాపకులు వీటిపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఇప్పుడు చేసిన ప్రయోగాలు భవిష్యత్ అవసరాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని, వాటిని పరిరక్షించాల్సిన అవసరం ఉందన్నారు. రిజిస్ట్రార్ చెన్నప్ప, వక్త శంకర్‌రావు ముంజం, ఐక్యూఏసీ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి, కంట్రోలర్ రాజ్‌కుమార్, మధు, అర్జున్‌కుమార్, కుమారస్వామి, శాంతిప్రియ, విజయలక్ష్మీ పాల్గొన్నారు.
ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి
ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి
ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి
Comments
Please login to add a commentAdd a comment