
శ్రీశైలానికి ప్రత్యేక బస్సులు
● మహా శివరాత్రి సందర్భంగారీజియన్ నుంచి 357 సర్వీసులు
స్టేషన్ మహబూబ్‌నగర్: మహాశివరాత్రిని పురస్కరించుకొని భక్తుల సౌకర్యార్థం శ్రీశైలం పుణ్యక్షేత్రానికి మహబూబ్‌నగర్ ఆర్టీసీ రీజియన్ పరిధిలో సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రత్యేక బస్సులు నడుపనున్నారు. రీజియన్‌లోని 9 డిపోల నుంచి శ్రీశైలం వరకు 357 ప్రత్యేక బస్సులు నడపనున్నారు. ప్రతి ఏడాది రీజియన్‌లోని డిపోల నుంచి శ్రీశైలానికి ప్రత్యేక బస్సులు నడుపుతారు. శివరాత్రి అనంతరం తిరుగు ప్రయాణం రోజుల్లో కూడా ప్రత్యేక బస్సులు నడపడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో అచ్చంపేట డిపో నుంచి 58, గద్వాల నుంచి 15, కల్వకుర్తి 34, కొల్లాపూర్ 37, మహబూబ్‌నగర్ 85, నాగర్‌కర్నూల్ 56, నారాయణపేట 23, షాద్‌నగర్ 6, వనపర్తి డిపో నుంచి 43 ప్రత్యేక బస్సులు నడువనున్నాయి. ముఖ్యంగా మహాశివరాత్రి రోజు రీజియన్ నుంచి 151 బస్సులు నడపనున్నారు.
సద్వినియోగం చేసుకోవాలి..
శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని రీజియన్‌లోని డిపోల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని, ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని రీజినల్ మేనేజర్ సంతోష్‌కుమార్ తెలిపారు. శ్రీశైలంతోపాటు ఆయా బస్టాండ్లలో ప్రయాణికుల సౌకర్యార్థం చలువ పందిర్లు, తాగునీరు, వలంటీర్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
బస్సుల వివరాలు, తేదీల వారీగా..
Comments
Please login to add a commentAdd a comment