
రామన్‌పాడులో 1,020 అడుగుల నీటిమట్టం
మదనాపురం: మండలంలోని రామన్‌పాడు జలాశయంలో శనివారం పూర్తిస్థాయి నీటిమట్టం 1,020 అడుగులు ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ కాల్వ నుంచి 730 క్యూసెక్కుల వరద వస్తుండగా.. సమాంతర కాల్వ నుంచి నీటి సరఫరా నిలిపివేశారు. ఎన్టీఆర్ కాల్వకు 859 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 20 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నామని వివరించారు.
చెస్ జిల్లా కార్యవర్గం ఎన్నిక
వనపర్తి రూరల్: జిల్లాకేంద్రంలో శనివారం చెస్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం సంఘం భవనంలో జరిగింది. ఈ సందర్భంగా సంఘం జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా డా. మురళీధర్, అధ్యక్షుడిగా యాదగిరి, అసోసియేషన్ అధ్యక్షుడిగా గణేష్‌కుమార్, ఉపాధ్యక్షులుగా రాంప్రసాద్, నర్సింహ, ప్రధానకార్యదర్శిగా వేణుగోపాల్, కార్యదర్శలు రవీందర్‌గౌడ్, రాములు, కోశాధికారిగా టీపీ కృష్ణయ్య, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా బుచ్చిబాబు ఎన్నికయ్యారు. ఈ కార్యవర్గం నాలుగేళ్ల పాటు కొనసాగనుంది.
Comments
Please login to add a commentAdd a comment