వనపర్తిటౌన్: జిల్లా కేంద్రంలో సీఎం రేవంత్‌రెడ్డి రూ.వెయ్యి కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభిస్తారని హంగామా సృష్టించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు.. రూ. 550 కోట్ల పనులకే పరిమితం కావడం సిగ్గుచేటని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దుప్పల్లి నారాయణ ఎద్దేవా చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలకు చెప్పేది ఒకటి.. చేసేది మరొకటి అనే కాంగ్రెస్ నైజం వనపర్తి వేదికగా బయటపడిందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించిన అభివృద్ధి పనుల్లో కేంద్ర ప్రభుత్వ నిధుల వాటా ఉందని ప్రకటించకపోవడం దారుణమన్నారు. ఒకే పార్టీలో ఉంటూ కేంద్ర మంత్రి స్థాయి వరకు ఎదిగిన కిషన్‌రెడ్డిపై అనవసర విమర్శలు చేయడం తగదని హితవు పలికారు. సమావేశంలో బీజేపీ నాయకులు చిత్తారి ప్రభాకర్, రామన్‌గౌడ్, పెద్దిరాజు, శ్రీనివాస్, కుమారస్వామి, వెంకటేశ్వర్‌రెడ్డి, కుమార్, గోపినాథ్, రాజశేఖర్‌గౌడ్, నవీన్‌చారి, రవికుమార్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment