లోక్ అదాలత్‌ను వినియోగించుకోవాలి
వనపర్తిటౌన్: లోక్ అదాలత్‌లో కేసుల పరిష్కారం శాశ్వతమని.. కోర్టుకు వెచ్చించే సమయం కూడా ఆదా కావడంతో పాటు ఫీజు వాపస్ ఇవ్వబడుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్ సునీత తెలిపారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని న్యాయ విజ్ఞాన సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి రజనితో కలిసి మాట్లాడారు. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న సివిల్, క్రిమినల్ కేసుల పరిష్కారానికి మార్చి 8న నిర్వహించే జాతీయ లోక్‌అదాలత్ గొప్ప అవకాశమని.. కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. లోక్ అదాలత్ కేసుల పరిష్కారంలో రాష్ట్రంలోనే జిల్లా స్థానం రోజురోజుకు మెరుగుపడుతుందని వివరించారు. గతేడాది డిసెంబర్‌లో నిర్వహించిన లోక్‌అదాలత్‌లో అత్యధిక కేసులు పరిష్కరించి రాష్ట్రంలో 22వ స్థానంలో నిలవడమే ఇందుకు నిదర్శనమని గుర్తు చేశారు. వచ్చే నెలలో జరిగే లోక్‌అదాలత్‌లో రెట్టింపు కేసుల పరిష్కారమే లక్ష్యంగా కార్యాచరణ అమలు చేసి క్షేత్రస్థాయిలో వేగవంతం చేశామని, ఇందుకు పోలీసు, న్యాయవాదుల పాత్ర కూడా కీలకమని తెలిపారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్ సునీత
Comments
Please login to add a commentAdd a comment