‘పది’లో ఉత్తమ ఫలితాలు సాధించాలి
కొత్తకోట: ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. కొత్తకోటలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలను గురువారం అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్‌తో కలిసి కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో వంటగది, ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. మెస్ కమిటీ సమక్షంలో కిరాణ సరుకుల నాణ్యతను పరిశీలించిన తర్వాతే దించుకోవాలని సూచించారు. సూపర్‌వైజర్లు భోజనాన్ని రుచి చూసిన తర్వాతే విద్యార్థినులకు వడ్డించాలన్నారు. పదోతరగతి విద్యార్థినులపై ప్రత్యేక శ్రద్ధ వహించి, వార్షిక పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం విద్యార్థినులతో కలిసి కలెక్టర్ సహపంక్తి భోజనం చేశారు. కార్యక్రమంలో సాంఘిక సంక్షేమశాఖ అధికారి మల్లికార్జున్, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ చెన్నమ్మ, ప్రిన్సిపాల్ మాధవి ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment