
ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం
వీపనగండ్ల: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన హామీ మేరకు పంట రుణాల మాఫీని పూర్తిచేసిందని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం మండలంలోని సంగినేనిపల్లిలో ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులు రూ. 20లక్షలతో సీసీరోడ్డు, రూ. 5లక్షలతో ఉన్నత పాఠశాల ప్రహరీ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. గోపల్‌దిన్నెలో రూ. 20లక్షలతో నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించిన అనంతరం సీసీరోడ్డు పనులకు భూమిపూజ చేశారు. అదే విధంగా రూ. 90 లక్షలతో గోఽవర్ధనగిరి – రంగవరం రోడ్డు, రూ. 80 లక్షలతో రంగవరం – నాగసానిపల్లి బీటీరోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. రంగవరం, గోపల్‌దిన్నె, పుల్గర్‌చర్ల తదితర గ్రామాల్లో లోఓల్టేజీ సమస్య పరిష్కారం కోసం 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా గోపల్‌దిన్నె రైతువేదికలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి జూపల్లి మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేస్తున్నట్లు వివరించారు. ఒక్కో రైతు కుటుంబానికి రూ. 2లక్షల వరకు రుణాన్ని మాఫీ చేశామన్నారు. అర్హులైన పేదలందరికీ 200 యూనిట్లలోపు విద్యుత్ ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. అయితే సాంకేతిక సమస్యతో కొందరికి జీరో బిల్లులు రావడంలేదనే విషయం తన దృష్టికి వచ్చిందని.. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. అదే విధంగా రూ. 500లకే సబ్సిడీపై గ్యాస్ సిలిండర్ అందిస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. రంగవరం, గోపల్‌దిన్నె గ్రామాల మధ్య నెలకొన్న భూ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
రైతులందరి పంట రుణాలు మాఫీ
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తాం
రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
గోపల్‌దిన్నె గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రెండు రోజులుగా సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరహార దీక్షలను మంత్రి జూపల్లి కృష్ణారావు విరమింపజేశారు. గ్రామానికి రోడ్డు, బస్సు సౌకర్యం కల్పించాలని, అర్హులైన వారికి రేషన్ కార్డులు, పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ రిలే దీక్షలు చేపట్టగా.. ఆయా సమస్యలను పరిష్కరించడంతో పాటు అర్హుందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవర్ధన్ సాగర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బీరయ్య యాదవ్, నాయకులు నారాయణరెడ్డి, బాల్‌రెడ్డి, ఇంద్రకంటి వెంకటేష్, సుదర్శన్‌రెడ్డి, గోపాల్‌నాయక్, చక్ర వెంకటేష్, చిన్నారెడ్డి, రాంరెడ్డి, మోహన్, సీపీఎం మండల కార్యదర్శి బాల్‌రెడ్డి, వెంకటయ్య, నిరంజన్, శేఖర్‌రెడ్డి, చంద్రయ్య, రాములు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment