రియల్టర్లలో కొత్త ఆశలు..
రియల్ ఎస్టేట్ వ్యాపారంపై 60 శాతం మంది ఆధారపడి జీవిస్తున్నారు. అయితే ఎల్‌ఆర్‌ఎస్‌తో రియల్ ఎస్టేట్ వ్యాపారం కుదేలైన విషయం తెలిసిందే. రిజిస్ట్రేషన్లు ఆగిపోవడంతో ఒక్కసారిగా రియల్ వ్యాపారం నేలచూపులు చూసింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో మరోసారి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జన సందడి కనిపించనుంది. అప్పుల ఊబిల్లో కూరుకుపోయిన రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ప్రభుత్వం కొంత ఊరటనిచ్చిందని చెప్పవచ్చు.
రూ.కోట్లలో ఆదాయం..
2001లో ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులు స్వీకరించిన విషయం విదితమే. అయితే ఒక్కో దరఖాస్తుకు రూ.వెయ్యి చొప్పున ప్రాథమిక రుసుము వసూలు చేశారు. తద్వారా జిల్లావ్యాప్తంగా రూ. కోట్లలో ప్రభుత్వానికి ఆదాయం సమకూరింది. అదే తరహాలో మిగతా మొత్తం చెల్లించేలా చేసి ప్రభుత్వం ఆదాయం సమకూర్చుకునే ప్రయత్నంలో భాగంగా ఎల్‌ఆర్‌ఎస్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం సాగుతోంది.
రియల్టర్లలో కొత్త ఆశలు..
Comments
Please login to add a commentAdd a comment